ఘోరం.. మహిళను వివస్త్రను చేసి.. చిత్రవధ

వివస్త్రను చేసి మంచానికి
కట్టి జననాంగాలపై జీడి పోసి…

  • హనుమకొండలో దారుణ ఘటన – మహిళను గుండు గీయించి చిత్రహింసలు

హనుమకొండ, జూన్ 28 (విశ్వం న్యూస్): వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళపై అతి దారుణంగా హింసాత్మకంగా ప్రవర్తించిన ఘటన హనుమకొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఐదు రోజుల క్రితం ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన చిక్కుడు రాజు, చిక్కుడు గంగ దంపతులు. రాజు గత నాలుగేళ్లుగా అదే గ్రామానికి చెందిన రమ అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి రమతో కలిసి జీవిస్తున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజు భార్య గంగ, రమ మధ్య ఇప్పటికే పలు వివాదాలు చోటు చేసుకున్నాయి.

ఆరునెలల క్రితం రాజు-రమ గ్రామం విడిచిపెట్టి వేరే ఊర్లో కాపురం పెట్టారు. అయితే ఈ నెల 22న, ఇద్దరినీ తిరిగి తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి గంగ కుటుంబ సభ్యులు రమపై దాడి చేశారు. మిగతా మహిళల సహకారంతో ఆమెను గుండు గీయించి, దుస్తులు విప్పించి మంచానికి కట్టి, శరీరాన్ని గాయపరిచేలా జీడిపోసి, చిత్రహింసలకు గురిచేయడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారు.

ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్న గంగ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కనిపించకుండా పోయిన రాజు, రమ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సమాజంలో ఇలాంటి చర్యలు తీవ్రంగా ఖండించదగ్గవి. చట్టానికి లోబడి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇలా హింస ద్వారా న్యాయం సాధించాలనే ప్రయత్నం నేరంగా పరిగణించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *