Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

మీ బలుపు ఎవడికి చూపిస్తున్నరు? వదిలిపెట్టం రా..!:మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 29 (విశ్వం న్యూస్): “మహా న్యూస్ ఛానల్‌పై జరిగినది దాడి కాదు… ప్రజా విప్లవం ఆరంభానికి సంకేతం మాత్రమే!” అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రపీఠాధిపత్యం నుంచి విముక్తం చేసిన నేత కేసీఆర్‌పై కక్ష కట్టి కొంతమంది మీడియా హౌస్‌లు “స్లాటర్ హౌస్‌ల”లా వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు. “మీడియా హక్కు పేరుతో ఎవరి ప్రతిష్ఠనైనా నాశనం చేయడం జరగబోదు. ఇంకో రెండు మూడు యెల్లో మీడియా సంస్థలు ఉన్నాయి.. వాటి పని కూడా చేస్తాం” అని హెచ్చరించారు.

“మీ బలుపు ఏంటి..? మీ అహంకారం ఏంటి..? ఎవడ్ని చూసి మీకు ఈ ధైర్యం..! మేము వదిలిపెట్టం, మా దాడి వేరే విధంగా ఉంటుంది. ఎవరు మిమ్మల్ని కాపాడలేరు” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. “సంవత్సర కాలంగా మీ చెంచా గాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. నిజాలను తలకిందులుగా చూపించే ఈ వ్యవస్థలపై పోరాటం తప్పదని” స్పష్టం చేశారు.

“దాడులు మొదలయ్యాయని అనుకోవద్దు.. కానీ మా సహనానికి ఇప్పుడు పరీక్ష వేస్తున్నారు. తెలంగాణ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేయడానికైనా మేము వెనుకాడం” అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *