మూఢనమ్మకాలపేరుతో
అసాంఘిక కార్యకలాపాలు
- శాస్త్రీయ విద్యా విధానం అందరికీ సమాన విద్యా లక్ష్యంగా విద్యార్థులు పోరాటం చేయాలి
- జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దయానంద్
మహబూబాబాద్, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : భారత విద్యార్థి ఫెడరేషన్ SFI మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విద్య విజ్ఞానిక శిక్షణ తరగతులు శనివారం స్థానిక పెరుమండ్ల జగన్నాథం భవన్ లో జిల్లా కార్యదర్శి సాయి కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ క్లాస్ లను బోధించడానికి క్లాస్ టీచర్ గా జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దయానంద్ గారు శాస్త్రీయ దృక్పథం – ముడ నమ్మకాలు విద్యార్థుల కర్తవ్యం అనే అంశం పై బోధించడం జరిగింది. రెండవ క్లాస్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు విద్యార్థులపై ప్రభావం అనే అంశం పై SFI మాజీ రాష్ట్ర నాయకులు సాదుల శ్రీనివాస్ బోధించడం జరిగింది. ఈ సందర్భంగా లింగంపల్లి దయానంద్ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకీ అశాస్త్రియ ఆలోచనలతో మూఢనమ్మకాలపేరుతో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి అని అన్నారు.
దేశాన్ని నడిపించేది కేవలం సైన్స్ మాత్రమే అని కొనియాడారు, కావున విద్యార్థులంతా సైన్స్ వైపు నడవాలని పిలుపునిచ్చారు… ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం డార్విన్ అనే సిద్ధాంతాన్ని పాఠ్య పుస్తకాల్లో నుంచి తీసివేయడం అంటే విద్యార్థుల మూఢనమ్మకాలు పెంచడమే అని అర్థం అన్నారు… డార్విన్ సిద్ధాంతాన్ని తీసివేయడం దారుణమని అన్నారు… సైన్స్ లేకపోతే భవిషత్తు మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుందని అన్నారు. అదే విధంగా సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని అన్నారు.. దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోయి విద్యార్థుల అవస్థలు పడుతున్నారని అన్నారు.. విద్యార్థలు భవిష్యత్తులో పోరాటానికి సిద్ధంగా కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో SFI జిల్లా ఉపాధ్యక్షులు మధు,జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్,వీరబాబు, జ్యోతి బాస్,నాయకులు సింహాద్రి, మురళి, అనూష, శ్రావణి, లావణ్య, ప్రవీణ్, వినోద్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.