మణిపూర్ మారణకాండ వెనుక ఏం జరిగింది….?

  • ముమ్మాటికీ మతోన్మాదం సృష్టించిన మారణకాండ
  • ఆ ఐదు రాష్ట్రాలలో పొంచి ఉన్న నిశ్శబ్ద విప్లవం

హైదరాబాద్, జూలై 23 (విశ్వం న్యూస్) : భారతదేశంలోని 29 రాష్ట్రాలలో మేఘాలయ, నాగాలాండ్, మిజోరం ఈ మూడు రాష్ట్రాలలో నివసించేవారు ఆదివాసిలు వీరంతా క్రైస్తవులు మణిపూర్ లో 30 శాతం మంది క్రైస్తవులు. అయితే ఇక్కడ నివసించే వారంతా స్థానికులు కారు. మణిపూర్ లో ఉండే వారంతా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ వారికి అనువుగా ఉన్న వ్యాపారాలు, వివిధ పనులు చేసుకుని జీవనం సాగించేవారు. అలా వచ్చిన ఆదివాసిలకు బయట ప్రపంచం ఎలా ఉందో తెలిసేది కాదు. మనిషి నాగరికత, ఎదుగుదల, విద్య-వైద్యం వంటి అవకాశాలు ఒకప్పుడు మణిపూర్ రాష్ట్ర ప్రజలకు పెద్దగా అందుబాటులో లేవు. ఆ కారణంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో పాటు ఆ ప్రదేశానికి చెందిన మణిపూర్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకరిపై ఆధార పడకుండా, వారి కష్టార్జితంతో స్వేచ్చా జీవితాలు గడిపేవారు. ఒకరిపై ఆధార పడటం,ఒకరి సహకారం కోరడం అనేది అప్పట్లో ఆదివాసిలకు ఉండేది కాదు.

ఇక్కడ మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, మయన్మార్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఐదు రాష్ట్రాలలో నివసించిన ఆదివాసి జాతుల మనుషులు నాగ రిక ప్రపంచానికి దూరంగా ఉండేవారు. వీరి జీవన విధానం ఎలా ఉండేది అంటే… వీరిలో కొందరు నరమాంస భక్షులుగా ఉండే వారు.మత్తు పదార్థాల వాడకం వీరికి బాగా ఎక్కువగా ఉండేది. మత్తులో మునిగి హాయిగా,స్వేచ్ఛగా బ్రతికేవారు. కుటుంబ నియంత్రణ పద్ధతులు, విధానాలు వీరు ఏ మాత్రం పట్టించుకునేవారు కాదు. ఆదివాసి జీవితాలు కాబట్టి వారి మానాన వారిని స్వేచ్ఛగా వదిలేసి పాలకులు, ప్రభుత్వాలు కూడా వారి అభివృద్ధికి పెద్దగా తీసుకున్న చర్యలు ఏమీ లేవు.

ఇటువంటి పరిస్థితుల్లో కొద్దో- గొప్పో చదువుకున్న వ్యక్తులు, అక్కడ ఆదివాసిలకు జరుగుతున్న అన్యా యం పై ఆలోచించగలిగిన వ్యక్తులు తిరుగుబాటు చేస్తూ స్థానికంగా ఉల్ఫా (నక్సలైట్స్) మాదిరిగా ఉద్యమాల బాటపెట్టి ఉల్ఫాలుగా మారి ఆదివాసిల జీవిత విధానాలకు, హక్కుల సాధనకు పోరాడుతున్నారు. ఈ క్రమం లోనే ఉల్ఫా ఉద్యమాల నేపథ్యంలో నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభు త్వం నాగరికత తెలియని కొన్ని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరిగింది. ఆ సమయంలో స్థానిక ఆది వాసిలకు ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు పంచి వ్యవసాయ ఆధారితంగా పంటలు పండించుకుని ఉన్నతంగా జీవించమని ఉచితముగా భూములు ఇవ్వడం జరిగింది.

ఈ క్రమంలో స్థానికంగా జీవిస్తున్న ఆదివాసీలలో ఉన్న పలు రకాల తెగల ప్రజలు చాలా వరకు నాగరికత తెలుసుకున్నారు. మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఈదే క్రమంలో భారత్ లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల జీవన స్థితిగతులు తెలుసుకున్న యునైటెడ్ క్రిస్టియన్ దేశాలు ఈ ఐదు రాష్ట్రాల ప్రజలకు సహాయ- సహకారాలు అందిస్తూ ఉండేవి.

రాజకీయ లబ్ది కోసం- మత్తుకు బానిసలుగా మార్చారు
ఇది ఇలా ఉంటే భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలలో 25 రాష్ట్రాలకు మాత్రం మద్యం ఒక రేటు ఉంటుంది. ఈ నాలుగు రాష్ట్రాలకు మాత్రం.ఏ రకం మద్యం అయినా ధరలో వ్యత్యాసం ఉంటుంది.
ఉదాహరణకు 25 రాష్ట్రా ల్లో ఒక ఫుల్ బాటిల్ మద్యం ఖరీదు.1000 రూపాయలు. కానీ ఆ నాలుగు రాష్ట్రాల్లో ఒక ఫుల్ బాటిల్ మద్యం ఖరీదు 400 రూపాయలు మాత్రమే ఉంటుంది. అలాగే గంజాయి, కొకైన్, హెరాయిన్, బ్రవున్ షుగర్ వంటి మత్తు పదార్థాలను ప్రజలు ఇక్కడ పబ్లిక్ గా వాడినప్పటికీ అధికారులు ఏ మాత్రం పట్టించు కునే చర్యలు శూన్యం. ఇక లా అండ్ ఆర్డర్ అనేది ఈ ప్రాంతంలో పనిచేయదు. ఎందుకంటే ఇవి మనలా అభివృద్ధి చెందిన రాష్ట్రా లు కాదు. చాలా వరకు అవి అభివృద్ధి చెందని ప్రాంతాలుగా ఉన్నాయి. కావున ప్రభుత్వం ఇక్కడ ప్రజలని స్వేచ్ఛగా వదిలేసి,మత్తుకు బానిసలను చేశారు.

మతోన్మాదులకు “మణిపూర్” టార్గెట్ వెనుక
ఇక్కడ నివసించే ముస్లింలు బంగ్లాదేశీయులు. పక్కనే ఉన్న బర్మా నుంచి వచ్చినవారు. మార్వాడి, పంజాబీలు, హర్యానీలు అనేక ప్రాంతా ల నుండి వచ్చిన వేరు,వేరు మతాల ప్రజలతో ఇప్పుడు మణిపూర్ బాగా అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో మణిపూర్ లో అన్ని మతాలకు చెందిన ప్రజలతో పాటు,ఆదివాసి తెగల ప్రజలు కూడా చక్కగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, మయన్మార్ రాష్ట్రాలలో జీవిస్తున్న ఆదివాసిలకు యునైటెడ్ క్రిస్టియన్ దేశాలు అందించిన సహాయ-సహకారాలు వలన ఈ రాష్ట్రాలలో క్రిస్టియానిటీ బలపడింది. మణిపూర్ లో పెద్ద ఎత్తున చర్చిల నిర్మాణం జరిగింది. అలాగే మణిపూర్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల లో కూడా క్రిస్టియానిటీకి ఆధరణ పెరుగుతుంది.

ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే….!!
మణిపూర్ లో జరిగిన దాడుల వెనుక కుట్రలు ఇలా ఉన్నాయి.మే నెలలో ఓ…అర్ధరాత్రి 12 గంటలకు మొదలైన ఈ మతోన్మాదం కధ ఇది. ఓ రోజు ఉదయం 6 గంటలకు మొబైల్ నెట్ వర్క్, వై-ఫై సేవలు ఉద్దేశ పూర్వకంగా మణిపూర్ లో నిలిపివేయడం జరిగింది. అప్పటికే అక్కడ 400 చర్చిలు ఉన్న మణిపూర్ లో 230 చర్చిలు తగల బెట్టారు. మూడు జాతుల ఆదివాసిల మీద మతోన్మాదం మత్తులో కొన్ని శక్తు లు తెగబడి కత్తులతో బాంబులతో కనబడినవారినంత చిత్రహింసలకు గురి చేస్తూ ముగ్గురు మహిళలను నగ్నంగా బట్టలు ఊడ దీసి ఊరేగించి మానభంగం చేశారు. ముగ్గురుమహిళల్లో ఒకరి భర్త ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తి. దేశానికి,దేశ ప్రజల రక్షణకు శత్రు దేశ సైన్యానికి గుండె ను అడ్డంగా పెట్టి పోరాడి మనకు రక్షణ కల్పించిన యోధుడికి ఈ దేశం ఇచ్చిన గౌరవం. ఆ సైనికుడి భార్య, మరో ఇద్దరు నగ్న శరీరాలలో ఉన్న రహస్య భాగాలను నడివీధుల్లో ఊరేగించిన మూర్ఖపు మతోన్మాద చర్యగా తెలుస్తుంది. అర్ధరాత్రి మహిళ ఒంటరిగా సంచరించ గలిగిన వేళ దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు చెప్పే మహనీయుల మాటలు బట్టీపట్టి లెక్చర్లు ఇచ్చే పాలకులు, నాయకుల మెదళ్ళలో మతోన్మాద అగ్నికీలలు రాజుకున్నాయి.

మత, రాజకీయ ఉన్మాదపు ఉచ్చులో దేశం
భారత దేశం, హిందూ దేశం, భరతమాత, ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం,సర్వమత సమ్మేళనం కలిగినది ఈ నాదేశం అని గర్వంగా చెప్పుకునే దేశభక్తులు ఎక్కడ…? కులం చూడం-మతం చూడం అని చెప్పుకునే రాజకీయ నాయకులు ఎక్కడ….? మతోన్మాదులు మారణహోమం సృష్టిస్తుంటే… మనకెందుకులే అనికొని మంచి వ్యక్తులు ఎక్కడ…?సామాజిక సిద్ధాంతాలు చెప్పేవారు ఎక్కడ….? అన్నిటికి మించిన మానవతావాదులు ఎక్కడ…? ప్రశ్నించలేని కుళ్ళిన సమాజమా…. జరిగిన అన్యాయానికి నీ సమాధానం మౌనమేనా..? ఆలోచించు… కనీసం ప్రశ్నించు…! భారత జాతి మహిళల మాన-ప్రాణాల తో జరుగుతున్న నీచ- నికృష్ట, వికృత చేష్టల వెనుక ఉన్న రాజకీయమే ఈ మతోన్మాద మత్తు క్రీడ అని తెలుసుకో….! ఇక ఉత్తర భారతదేశం ఎంతో అభివృద్ధి జరిగింది అనే భావనలో ఉన్నాం మనం. ఇదా మన అభివృద్ధి, ఇంతటి నీచ సంస్కృతి కి జీవం పోసింది ఎవడు…? నగ్నంగా నడివీధుల్లో దేశాన్ని ఊరేగించారు… దేశ సైనికుల గుండెల్ని చీల్చి సైనిక శక్తులను హత మార్చారు. అన్నీ తెలిసి అయ్యో పాపం అంటూ మొసలి కన్నీరు కారుస్తూ చేసిన తప్పుల్ని కప్పి పుచ్చుకోవాలి అంటే ఇక కుదిరే పనికాదు. ఎప్పుడో రెండున్నర నెలలకు ముందు మొదలయిన మహిళల నగ్నదేహాల ఊరే గింపు ప్రదర్శన దాయాలి అనుకున్నా దాగలేదు. అంటే…ఈ వికృత చర్యల కు పురుడుపోసిన శక్తుల అంతం ఇక ఆరంభం అయినట్లే…. సిగ్గు దాచు కోవడానికి ప్రాణాలు పణంగా పెట్టే నా భరత జాతి స్త్రీలను నడివీధిలో నగ్నంగా ఊరేగించి, మృగాలై మానభంగానికి తెగబడిన శక్తులపై దేశంలో 29 రాష్ట్రాలలో స్త్రీ జాతి పిడికిలి ఎత్తి పోరాడే రోజు వస్తుంది….మీ అంతం చూస్తుంది.

(ధనియాల ప్రభుదాస్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *