ఎర్ర జెండా వీరులెక్కడ ??

ఎర్ర జెండా వీరులెక్కడ ??

  • బోల్షివిక్ పట్టుదల సడలిందా కామ్రేడ్స్!

హైదరాబాద్, అక్టోబర్ 26 (విశ్వం న్యూస్):పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సోషలిస్టు వ్యవస్థను నిర్మించి, ప్రజలే పాలకులుగా ఉండే మరో ప్రపంచంకోసం పోరాడాల్సిన మీ పోరాట స్పూర్తి ఏమైంది?????? బాదితులకు అండగా ఉండాల్సిన ఎర్రజండా దోపిడిదార్లకు దన్నుగా ఎందుకు నిలిచింది? మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో మహాశయులు కలలుగన్న మరో ప్రపంచం ఇదేనా? ఓట్ల సీట్ల కోసం ఎర్రజండాను పాలకులకు పాదాక్రాంతం చేస్తారా????? ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు నేలమీదనే కమ్యూనిస్టులకు కులతత్వం ఎందుకుంది? (విప్లవకమ్యూనిస్టులకు మినహాయింపు ఎక్కడ రైతాంగసాయుధపోరాటస్పూర్తి? బందూకులకు ఎదురునిలిచిన బషీర్ బాగ్ పోరాటం ఎక్కడ? ముదిగొండ వీరుల త్యాగం వృధాయేనా????

ఉభయ కమ్యూనిస్టుపార్టీలో ఉండే క్యాడర్ చిత్తశుద్దిని శంకించట్లేదు. భూస్వామ్య, పెట్టుబడిదారీవర్గాలకు వ్యతిరేకంగా తెగించి పోరాడే కార్యకర్తలు ఇప్పటికీ మీ పార్టీలో ఉన్నారు. మీ దివాళాకోరు నాయకత్వంవల్లే ఎర్రజండాకు ఈ దుస్థితి.

1952 లో వెంట్రుకవాసిలో అధికారం దూరమయింది. అదీ కుట్రపూరితంగా పెత్తందారుల కుట్రలవల్ల జరిగింది. ప్రజలు మిమ్మల్ని అంతగా విశ్వసించారు. మరి ఈరోజు ఆ ప్రజలు ఎందుకు దూరమయ్యారో ఆత్మావలోకనం చేసుకోండి. ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా ఏ పార్టీతోనైనా జట్టుకడితే శ్రామికవర్గమే నాయకత్వం వహించాలని కామ్రేడ్ మావో చెప్పారు కదా.

మరి మీరు దొంగల నాయకత్వంతో ఎందుకు అంటకాగుతున్నారు? మీరు పదవులకోసం ఎందుకు దిగజారుతున్నారు? మీలో (నాయకుల్లో)పోరాడేతత్వం కొరవడింది. త్యాగం చేయడానికి సిద్దంగాలేరు. ఎసికార్లలో, ఎసి రూముల్లో సుఖానికి అలవాటుపడ్డారు. మీకున్న అధికార, ధన దాహంతో క్యాడర్ ను నిర్వీర్యం చేశారు. ఎర్రజండా నీడకింద కార్పోరేట్ వ్యాపారం చేస్తున్నారు.

మీరే నిజమైన ప్రజాద్రోహులు.
హైడ్రాబాధితులు అరణ్యరోధన చెస్తున్నారు. ఇళ్ళు కోల్పోయినవారు హాహాకారాలు చేస్తున్నారు.
నిరుద్యోగ యువత ఒంటిపై లాఠీలు నాట్యమాడుతున్నాయి. నిరుద్యోగులు ఆంధోళనలు మిన్నంటాయి.
రైతు పెట్టుబడి అందక, రుణమాఫీ సక్రమంగా జరగక రైతులు బాధలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా మీ ఎర్రజండ జాడలేదు. పాలకుల నీడలో పదవులు వెతుక్కుంటున్నారా? మారండి కామ్రేడ్స్, ప్రజలకోసం నిలబడండి కామ్రేడ్స్. మళ్ళీ అలనాటి ఎర్రజండా వెలుగులు తెలుగునేలంతా పరుచుకోవాలని కోరుకుంటూ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *