కరీంనగర్, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : వాళ్ళ సిద్ధాంతాలు బాగుంటాయి, వాళ్ళ ఉపన్యాసాలు ప్రేరణ ఇస్తాయి. కార్మిక కర్షక సామాన్య ప్రజల పక్షాన కొట్లాడుతాము అంటుంటారు. వారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంతో అధికారాన్నీ అనుభవిస్తుండేవారు. కేంద్రంలో యూపీఏ తో జత కలిసి తిరిగి అదే యూపీఏ ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ నాయకత్వాన్ని అబాసుపాలు చేసి అప్పుడు ధరల పెరుగుదల, కనీస వేతనమంటూ జాతీయస్థాయి ఉద్యమాలు నడిపి కాంగ్రెస్ పార్టీ ని సామాన్యుడి నుండి దూరం చేసే ప్రయత్నం చేశారు తరువాత బీజేపీ అధిక మొత్తంలో లోక్ సభ స్థానాలు గెలవడానికి కారణమయ్యారు.
తరువాత ధరల పెరుగుదలతో సామాన్యుడి బాధలు కనబడలేదు, కనీస వేతనం కోసం ఎదురుచూస్తున్న కర్షక, కార్మికులకు దగ్గరవలేదు కానీ రాష్ట్రంలో అధికార పార్టీ పంచన చేరారు. ఇప్పుడు జాతీయ హోదా కోల్పోయి రెక్కలు తెగిన పక్షిలా తయారయ్యారు.