గుడుంబా తయారు చేసినా, విక్రయించినా ఉపేక్షించేది లేదు

గుడుంబా తయారు చేసినా,
విక్రయించినా ఉపేక్షించేది లేదు

హుజురాబాద్ ఏ.సి.పి వెంకట్ రెడ్డి
జమ్మికుంట, మే 27 (విశ్వం న్యూస్) : ప్రభుత్వం నిషేధించిన గుడుంబాను తయారు చేసినా, విక్రయించినా ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ ఏ.సి.పి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏ.సి.పి మాట్లాడుతూ జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన దుస్స కొమురయ్య (52) గ్రామ శివారు చెరువు వద్ద అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారని దృఢమైన సమాచారం మేరకు పట్టణ సి.ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తనిఖీ చేయగా.. ఆ తనిఖీలలో 5 లీటర్ల గుడుంబా, 40 లీటర్ల బెల్లం పానకం, తయారు చేసే సామగ్రి లభ్యమైనట్లు తెలిపారు.

సదరు వాటిని స్వాధీనం చేసుకున్న అనంతరం స్టేషన్ కు తరలించి కొమురయ్య పై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పర్చనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన గుడుంబాను ఎవరైనా తయారు చేసినా, విక్రయించిన అవసరం మేరకు పి.డి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుల్ సురేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *