ప్రజలకు బంగారు
బోనాల శుభాకాంక్షలు

- బండ్లగూడ జాగీర్ 1వ డివిజన్
కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్
బండ్లగూడ జాగీర్, జూలై 15 (విశ్వం న్యూస్) : శ్రీ బంగారు మైసమ్మ తల్లి బంగారు బోనాలు పురస్కరించుకొని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ ప్రజలందరికీ బంగారు బోనాల శుభాకాంక్షలు తెలియజేసిన 1వ డివిజన్ కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు.
ముఖ్యంగా 1వ డివిజన్ ఓటరు దేవుళ్ళు, ప్రజలు ఈ బంగారు మైసమ్మ తల్లి బోనాలు ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరి ఇంట్లో బంగారం పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు.