మహిళల ఆర్థికాభివృద్ధితోనే.. కుటుంబాల వృద్ధి…
మహిళల ఆర్థికాభివృద్ధితోనే.. కుటుంబాల వృద్ధి…

మున్నూరుకాపు మహిళా మ్యాక్స్ సొసైటీ సీఈఓ
సర్దార్ పుటం పురుషోత్తం పటేల్
వరంగల్, మార్చి 17 (విశ్వం న్యూస్) : మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితేనే, ఆ కుటుంబాలు కూడా అభివృద్ది చెందుతాయని, మున్నూరు కాపు మహిళలు ఆర్థికంగా ఎదగాలని మున్నూరుకాపు మహిళా మ్యాక్స్ సొసైటీ CEO సర్దార్ పుట్టం పురుషోత్తరావు పటేల్ పిలుపునిచ్చారు. వరంగల్ మర్రి వెంకటయ్య కాలనీలో మిల్కూరి లక్ష్మీ, కన్నయ్య పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్ధికాభివృద్ధి కోసం తాము ముందుండి మహిళా మ్యాక్స్ సొసైటీ ఏర్పాటు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తున్నదన్నారు. మహిళలు ఎన్నో కుటీర పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశం ఉన్నదనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకోసం సబ్సిడీలు ఇస్తున్నాయని, వీటిని మనమంతా వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని పుటం పురుషోత్తం అన్నారు.

ఇందుకోసం ముందుగా మున్నూరుకాపు మహిళలంతా మ్యాక్స్ సొసైటీలో సభ్యత్వాలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు మిల్కూరి లక్ష్మి పటేల్, కేడల పద్మ పటేల్, బండారు శోభ పటేల్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు పెండెల సంపత్ పటేల్, మహిళా అధ్యక్షురాలు మంకు కవితా పటేల్, పశ్చిమ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్ పటేల్, కాపుసంఘం నాయకులు మిల్కూరి కన్నయ్య పటేల్, కేడల జనార్దన్ పటేల్, కోల జనార్ధన్ పటేల్, బండారి రవికుమార్ పటేల్, డాక్టర్ గోపాల ఇతిహాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లకు మెమెంటోలు అందజేశారు. వారంతా పురుషోత్తం పటేల్ కు శాలువాలు కప్పి, ఘనంగా సన్మానం చేశారు.
