మైనర్ బాలుడిపై
మహిళ లైంగిక దాడి

- జూబ్లీహిల్స్‌లో షాకింగ్ ఘటన – పోక్సో కింద కేసు నమోదు
హైదరాబాద్, మే 4 (విశ్వం న్యూస్): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. 17 ఏళ్ల టీనేజర్‌పై ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న మహిళ పదేపదే లైంగిక వేధింపులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాలుడి మానసిక స్థితిలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు సంఘటనను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలుడు మైనర్ కావడంతో, పరస్పర సమ్మతితో సంబంధం ఉన్నా అది నేరంగా పరిగణించబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బాలుడు, మహిళ ఒకే ఇంట్లో పని చేస్తూ సన్నిహిత సంబంధం ఏర్పడినట్లు తేలింది. బాధితుడి ఆరోపణల మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం కూడా కేసులో సంబంధిత సెక్షన్లు చేర్చారు.
ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.