
- అబలయని దేశమును
- కబలించ తలపడిన
- పరరాజులకు స్త్రీల
- పటు శౌర్యమును చూపి
- రాజతంత్రము నడిపెరా
- తెలంగాణ రాణి రుద్రమదేవిరా
హైదరాబాద్, మే 19 (విశ్వం న్యూస్) : విప్లవ తెలంగాణ గడ్డపై విడ్రోవలేని మచ్చ – ఒక మంత్రి చేతిలో సాటి మహిళల అవమానం! పరదాడుల్లోనూ, పాలనలోనూ స్త్రీ శక్తిని చాటి చెప్పిన తెలంగాణ గడ్డ మీద నేడు ఓ అమానవీయ సంఘటన జరిగింది. చరిత్రలో రుద్రమదేవిలా పరక్రమంతో పాలన సాగించిన మహిళలు… చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యమ్మ, మద్ది స్వర్ణమ్మ వంటి విప్లవానాయికల త్యాగభూమి ఇది. కానీ నేడు అదే గడ్డపై, అదే జాతీయ చైతన్యానికి వ్యతిరేకంగా, అదే స్త్రీ శక్తికి మచ్చవేసే చర్య జరిగింది.
అందాల పోటీల పేరుతో, కొందరు యువతులను ప్రదర్శన వస్తువులుగా మార్చిన మానవీయ విలువల శూన్యతను మించిన దారుణం మరొకటి లేదు. దానికి తోడు, ఆయా పోటీలకు హాజరైన మహిళా మంత్రే, ఈ కార్యక్రమానికి ఆశీర్వాదం ఇస్తూ, ఒక “విప్లవకారిణి” అన్న పేరుతో, సాటి మహిళల పాదాల వద్ద కడుగుడు చేపించటం, తెలంగాణ మహిళల గౌరవాన్ని బోల్తా కొట్టిన దుర్దృష్టకర ఘట్టం.
విప్లవానికి పేరు పెట్టుకున్న వారు విప్లవ స్ఫూర్తికి తూటాగా మారినప్పుడు, ప్రజలకు మిగిలేది నిస్సహాయత మాత్రమే. కడివెండి రేణుకలాంటివారు విప్లవకారులు. పోరాట పీఠికలపై తమ ప్రాణాల్నే పెట్టి ప్రజల హక్కుల కోసం బలైనవారు. పదవుల కోసం పైశాచిక సంస్కృతికి మోకాళ్లబెట్టి, వ్యాపార శక్తుల ప్రదర్శనకు మద్దతిచ్చే వారు విప్లవకారులు కాదని, ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.
ఈ సంఘటనపై ప్రజా ప్రాతినిధ్యం కలిగిన మహిళా నేతలు మౌనం వహించడం, లేదా దానికి మద్దతు పలకడం… మరింత దారుణం. ఇది నూతన మద్యయుగం సంకేతం కాదు గానీ, ఫ్యూడలిజం పునరాగమనం అన్నదానికి ఉదాహరణ. వారి బాధ్యత ఏమిటో మరచిన వారు, విప్లవ జెండాను తమ అవసరాలకు వాడుకుంటే, అది ప్రజాస్వామ్యాన్ని ద్రోహించడమే.
ఇలాంటి “రెనెగేడ్” వ్యవహారాలను ప్రజలు ఎప్పుడూ చరిత్రలో నిలుపుకున్నారు.
చరిత్ర శాసించేదిది — ప్రజా గౌరవం కోసం నిలబడినవారినీ, దాన్ని తాకట్టు పెట్టిన వారినీ. తెలంగాణ గౌరవం తాకట్టు పడిన ఈ సంఘటనపై — ఒక మంత్రి క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వ నైతికత తలకిందులయిన సందర్భమిది.