మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
వరంగల్ బ్యూరో, మార్చి 6 (విశ్వం న్యూస్) : మహిళ సాధికారిక సాధన దిశగా ముందుకు పయనించాలని ఎస్ టి యు ములుగు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ శిరీష సతీష్ కుమార్ లు అన్నారు. సోమవారం మండలంలోని చల్వాయి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఎస్ టి యు గోవిందరావుపేట శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ శిరీష కుమార్ లు హాజరై మాట్లాడారు. ముందుగా మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి చాటి చెబుతూ విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సోలం కృష్ణయ్య, మండల శాఖ అధ్యక్షుడు జన్ను సామ్సన్, స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి, మరియు ఉపాధ్యాయినీలు పాల్గొనడం జరిగింది.