చెల్లెలు షర్మిలకు జగన్ భావోద్వేగ లేఖ

చెల్లెలు షర్మిలకు
జగన్ భావోద్వేగ లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 26 (విశ్వం న్యూస్) : వైఎస్ కుటుంబం ఆస్తి వివాదాల నేపథ్యంలో మరో లేఖ బయటకు వచ్చింది. గతంలో వైఎస్ జగన్.. చెల్లెలు షర్మిలకు రాసిన లేఖను వైసీపీ తన ఆధికారిక ఎక్స్ ఖాతా వేదికగా బయటపెట్టింది. వైఎస్ జగన్, షర్మిల ఆస్తి వివాదం నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లేఖను విడుదల చేస్తున్నట్లు వైసీపీ తెలిపింది.

వైఎస్ జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయన్న వైసీపీ.. ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలనేదే తమ ఉద్దేశమని పేర్కొంది. మరోవైపు 2024 ఎనిమిదో నెల 27వ తేదీ ఈ లేఖను రాసినట్లుగా అందులో ఉంది. ఈ లేఖలో వైఎస్ జగన్ అనేక విషయాలు ప్రస్తావించారు. అందులో ఏముందంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *