
హైదరాబాద్, , అక్టోబర్27 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో జరుగుతున్న ఆందోళనలను పోలీసు శాఖ సీరియ్‌సగా తీసుకుంది. సెలవుల విషయంలో ఇదివరకు ఉన్న పద్ధతినే అమలు చేస్తామని ప్రకటించినా.. నిరసనలు ఆగకపోవడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న వారు, న్యూస్ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తూ.. ఆందోళనలను ప్రేరేపిస్తున్న వారిని పోలీసు శాఖ గుర్తించింది. తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్న 39 మందిని గుర్తించి సస్పెండ్ చేసింది. వీరిలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. పోలీస్ యూనిఫాం క్రమశిక్షణకు మారుపేరని, యూనిఫాం సర్వీ్‌సలో ఉండి నిరసనలకు దిగడం సరికాదని డీజీపీ జితేందర్ అన్నారు.

రిక్రూట్‌మెంట్ సమయంలో, పోలీసు కానిస్టేబుళ్లను సివిల్ పోలీస్, ఆర్మ్‌డ్ పోలీస్ మరియు స్పెషల్ పోలీస్ అనే మూడు విభాగాలుగా ఎంపిక చేస్తారు. సివిల్ పోలీసుల విధులు జిల్లా మరియు నగర సాయుధ పోలీసు (AR) పోలీసుల సహాయంతో జిల్లాల్లో విచారణ, నేరాలను నిరోధించడం మరియు గుర్తించడం మరియు శాంతిభద్రతల సమస్యలను కూడా నిర్వహించడం, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు (TGSP) రాష్ట్రవ్యాప్తంగా ప్రసంగించడం. లా అండ్ ఆర్డర్ ఆందోళనలు అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా వివిధ విధుల కోసం మోహరించారు.