24వ డివిజన్ జ్యోతి నగర్ లో
కంటి వెలుగు ప్రారంభం

మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్
రమా వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో…
బోడుప్పల్, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తెలంగాణ కంటి వెలుగు ఉచిత కంటి పరీక్ష శిబిరంలో భాగంగా బుధవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ ల ఆధ్వర్యంలో ఈస్ట్ జ్యోతి నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ముఖ్యఅతిథిగా బోడుప్పల్ మేయర్ సామల బుచ్చి రెడ్డి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ వార్డ్ కమిటీ సభ్యులు,డివిజన్ వాసులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.