3వ డివిజన్ సాయి ఐశ్వర్య కాలనీలో కంటి వెలుగు శిబిరం ప్రారంభం

3వ డివిజన్ సాయి ఐశ్వర్య కాలనీలో కంటి వెలుగు శిబిరం ప్రారంభం

మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణ రావు, కార్పొరేటర్ బైటింటి శారద ఈశ్వర్ రెడ్డి హాజరు
పీర్జాదిగూడ, మార్చి 21 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి పరీక్ష శిబిరంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు సాయి ఐశ్వర్య కాలని రోడ్ నెంబర్ 15లోని బిఆర్ఎస్ పార్టీ డివిజన్ కార్యలయంలో స్థానిక కార్పొరేటర్ బైటింటి శారదా ఈశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి , కమీషనర్ రామకృష్ణ రావు,స్థానిక కార్పొరేటర్ బైటింటి శారద ఈశ్వర్ రెడ్డిలు హాజరై ఉచిత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంబిస్తారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూభారత దేశంలొనే ఎక్కడ లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమం నిరుపేద ప్రజల కోసం ఆరు నెలలపాటు ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం అని, ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మాత్రమే కొనసాగుతుందని పిలుపునిచ్చారు. కాబట్టి 3వ డివిజన్ లోని అన్ని కాలనీల ప్రజలు, వృద్ధులు, మహిళలు,పురుషులు,యువత తదితరులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. అదేవిధంగా ఈ కంటి వెలుగు శిబిరంలో అవసరం ఉన్నవారికి ఉచితంగా మెడిసిన్స్, కళ్ళద్దాలు, ఇంకా సర్జరీలు అవసరం ఉన్నట్లయితే ప్రభుత్వం ఆధీనంలో సర్జరీ కూడా చేయించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి రంగారెడ్డి, ఉపాధ్యక్షుడు జోగిరెడ్డి, సాయి ఐశ్వర్య కాలనీ అధ్యక్షులు ఏ ఎల్ ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకట్, సాయి ప్రియ కాలనీ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి పల్ల సంజీవరెడ్డి, సత్యనారాయణపురం అధ్యక్షులు శశిధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ధీరజ్ రెడ్డి, గోకుల్ నగర్ అధ్యక్షులు ప్రమీల, ప్రధాన కార్యదర్శి నాగమణి, శ్రీ సాయి ఇంక్లేవ్ కాలనీ నాయకులు జోసఫ్ రెడ్డి, డివిజన్ నాయకులు జి మురళీకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, కిరణ్, సంధ్యా, రజిత డాక్టర్లు వారి సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వారి సిబ్బంది యువత తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *