కరీంనగర్:అంబేడ్కర్ కు ఘన నివాళి

- ముఖ్య అతిథిలుగా విచ్చేసిన బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ,నగర అధ్యక్షులు కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి లతో కలిసి కార్యకర్తల సమక్షంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డి సి సి అద్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ లు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 371 ప్రకారం చట్టబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పార్లమెంటు సభ్యులుగా భాగస్వాములమయినందుకు మాకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

గడిచిన 9 సంవత్సరాలలో ఏనాడు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించని ముఖ్యమంత్రి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళిత నాయకుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతాడని, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నేడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నామని దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి కపట బుద్ధిని దళితులందరూ గమనిస్తున్నారని ప్రజలు ఎవరు కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మే నేనీ రోహిత్ రావు, జిల్లా కాంగ్రెస్ ఎస్.టి. సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.