ప్రకృతే జవాబిచ్చింది.. సంజయ్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

హైదరాబాద్‌, మే 10 (విశ్వం న్యూస్) : బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో స్పందించాయి. “ధర్మాన్ని మనం కాపాడితే అదే ధర్మం మనలను కాపాడుతుంది అనేది సనాతన ధర్మ సూత్రం. సనాతన ధర్మానికి నేనే ప్రతినిధినని చెప్పుకునే వారు ముందుగా ధర్మాన్ని అవగాహన చేసుకోవాలి” అంటూ విమర్శలు గుప్పించారు.

రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత స్థాయికి దిగజారి కుటుంబాలను, పుట్టుకలను అవహేళన చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన నాయకుడిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

“ప్రకృతి ఏదీ దాచుకోదు.. చేసిన పనులకు తగిన సమాధానం తిరిగి ఇస్తుంది. నేడు సంజయ్ సమాజానికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రకృతి న్యాయమే” అని వ్యాఖ్యానించారు. ప్రకృతి, ధర్మం పరస్పరం ముడిపడి ఉంటాయని, భస్మాసురుడు, నరకాసురుడు వంటి దుర్మార్గులు చివరకు ధర్మం ముందు నిలవలేకపోయారని గుర్తుచేశారు.

ఇంకా కేసీఆర్ పదవి వీడి రెండున్నరేళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సంజయ్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నప్పటికీ వాటిపై మాట్లాడకుండా ఉండటం బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కుకు సంకేతమని ఆరోపించారు.

ఉద్యమ నాయకుడిగా, ఐటీ మంత్రిగా దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకున్న కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొంటూ, “కేసీఆర్ సమర్థ నాయకత్వానికి ప్రతీక అయితే, కేటీఆర్ ప్రజల అభిమానాన్ని సంపాదించిన నాయకుడు” అని కొనియాడారు.

చివరగా “నిన్న సంజయ్ మాట్లాడిన మాటలకు నేడు ప్రకృతే జవాబిచ్చింది”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *