ఘనంగా బుద్ధ విగ్రహం ఆవిష్కరణ

ఘనంగా బుద్ధ విగ్రహం ఆవిష్కరణ

బుద్ధ విగ్రహ దాత టిడిపి నాయకులు వసునురి సన్నీ
బోడుప్పల్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలోని అంబేద్కర్ నగర్ ఫేస్ 3లో బుద్దునీ విగ్రహ ఆవిష్కరణ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా నాయకులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్, రాపోలు రాముల, స్థానిక కార్పొరేటర్ బొమ్మక్ కళ్యాణ్, వసనురి సన్నీ చేతుల మీదుగా ఘనంగా విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాంతి, సమానత్వం ప్రపంచానికి బోధించిన వ్యక్తి గౌతమ బుడ్డుడని కొనియాడారు. ఆంటీ గౌతమ బుద్ధుని చిహ్నం బోడుప్పల్లో ఏర్పాటు చేసుకోవడం, దానికి విగ్రహ దాతగా సన్నీ నిలవడం చాలా సంతోషంగాఉందని, ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రపంచం మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా శుభసూచికమని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జై భీమ్ యూత్ అసోసియేషన్ వారికి, విగ్రహ దాతగా నిలిచిన సున్నీకి అభినందనలు తెలియజేశారు.

ఈమేరకు సన్నీ మాట్లాడుతూ జై భీమ్ యూత్ వారు కుల మతాలకు అతీతంగా శాంతిని సమానాత్వాన్ని బోధించిన భగవాన్ బుద్ధుని విగ్రహ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వారు నా దగ్గరికి రావడంతో నాకు తోచిన సహాయంగా వారికి ఈ విగ్రహన్ని అందించడం జరిగిందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉందని, అంబేద్కర్ జయంతి నాడు ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బుద్ధుని అంబేద్కర్ గారి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *