
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా తన అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. తను కొత్త పార్టీ పెడుతున్నట్టు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించిన తీన్మార్ మల్లన్న.. మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయనున్నట్టు స్పష్టంచేశారు.
కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించడంతో పాటు ఏకంగా మంత్రి మల్లా రెడ్డి సొంత నియోజకవర్గమైన మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటించడం రాజకీయంగా చర్చనియాంశమైంది.
- పార్టీ అంటే పాన్ డబ్బాన
- ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీలు పురుడుపోసుకుంటున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల తెలంగాణ వేదికగా వైఎస్సార్‌టీపీ పేరుతో కొత్త పార్టీ స్థాపించి కేసీఆర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతోన్నారు. తాను తెలంగాణ కోడలునంటూ ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్నారు.
- రాష్ట్రంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌టీపీ, టీజేఎస్, బీఎస్పీ లాంటి పార్టీలు యాక్టివ్‌గా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో బలంగా ఉండగా.. మిగతా పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు చూస్తోన్నాయి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.
- ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జనసమితి (టీజేఎస్) కూడా భారాసకు ప్రత్నామ్యాయం అని ప్రజలు భావించారు. ఏమైందో మీకు తెలుసు. ఎలక్షన్స్ 7 నేలల సమయం ఉంది. ఎ ధైర్యంతో పార్టీ ప్రకటనో… కాలమే నిర్ణహిస్తుంది.
- కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ పెట్టినప్పుడు, పార్టీ అంటే పాన్ డబ్బాన అన్న ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. మరి మల్లన్న మరో కోదండరాం అవుతాడా?