కరీంనగర్ పట్టణంలో శ్రీ రేణుక
ఎల్లమ్మ దేవి బోనాల జోగు పండుగ

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవం లో భాగంగా మంగళ వారం రోజున కరీంనగర్ పట్టణం – రాంనగర్ లో మార్క్ పెడ్ ఏరియా, పద్మావతి ఫంక్షన్ హాల్, కల్లు డిపో రోడ్, చుట్టు ప్రక్కల పరిసర ప్రాంతాలలో గౌడ కుల బాంధవుల వారి ఇండ్లలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జోగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ కమిటీ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు. జోగుతో వస్తున్న అమ్మ వారి పూజరులని, సేవకులని, భక్తులని సాధరంగా ఆహ్వానించి, కట్నకానుకలు అందించి తల్లి కృపకు పాత్రులు కాగలరని గౌడ భాంధవులను కొరినారు.

జోగు కార్యక్రమంలో గౌడ భాంధవులు వారి వారి పేర్లు ముందుగా నమోదు చేసినచో అదేవిధంగా క్రమపద్ధతిలో జోగు కార్యక్రమం జరుగును. కావున గౌడ సంఘం నాయకులు, కులస్తులు సహకరించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగాల మహేష్ , నాగుల కిరణ్ గౌడ్, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, కె.మహేందర్ గౌడ్, జి.రాజేశం గౌడ్,కోడూరి తిరుపతి గౌడ్,బత్తిని సత్యం గౌడ్, కోడూరి స్వరాజ్ గౌడ్, గౌడ కుటుంబ సభ్యులు, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ పూజారులు, గౌడ సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయ కార్య నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ తెలిపారు.