వాగేశ్వరి కళాశాల ఎదుట… పరీక్షకు అనుమతించలేదని విద్యార్థుల ఆందోళన

వాగేశ్వరి కళాశాల ఎదుట… పరీక్షకు అనుమతించలేదని విద్యార్థుల ఆందోళన

తిమ్మాపూర్, జనవరి 3 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని స్థానిక వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం టీ.ఎస్.పి.ఎస్.సి, శ్రీ శిశు సంక్షేమ శాఖ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అర్హత పరీక్షను నిర్వహిం చారు. ఈ సందర్భంలో పరీక్ష సమయం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉండగా, 8.30 నుంచి 9.15 వరకు అభ్యర్థులను అనుమ తిస్తారు. పరీక్ష రాసే అభ్యర్థులు నిర్ణీత సమయ కంటే ఆలస్యంగా వచ్చిన కారణంగా సుమారు 150 మంది విద్యార్థులను పరీక్షకు అనుమతించ కపోవడంతో, కళాశాల ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షకు అనుమతిం చని విద్యార్థులు మాట్లాడుతూ..సరైన సమయానికి పరీక్షా కేంద్రానికి వచ్చిన తమను అను మతించకుం డా పోలీసుల సాయంతో బయటకు నెట్టి వేసినట్లు, బోరున విలపించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *