ఘనంగా రంజాన్‌ వేడుకలు..

ఘనంగా రంజాన్‌ వేడుకలు..

పాల్గొన్నా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ, అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్
జమ్మికుంట, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ పట్టణములో బస్సు స్టాండ్ ఎదురుగా ఉన్న ఉస్మాన్ సేట్ ఈద్గా మైదానములో దాదాపు 7 వేల మంది శనివారం రోజు ఉదయం 9 గంటలకు ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ నమాజును చదివినారు. నమాజు అనంతరం ఈద్గా మైదానములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ యాదగిరి నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ విజయకుమార్, హుజురాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హుజరాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ, అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈద్గా మైదానంలో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి కి సాల్వాతో సన్మానించి రుమాలీ టోపీ తొడిగించి ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అలాయి బలాయి చెప్పుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాయి బలాయి చేసుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *