ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం

జమ్మికుంట, ఏప్రిల్ 25 (విశ్వం న్యూస్) : ఈరోజు 23వ బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో శ్రీ పొనగంటి మల్లయ్య గారి ఆధ్వర్యంలో 23 వ వార్డుల జెండా కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి టంగుటూరి రాజకుమార్, అర్బన్ అధ్యక్షులు బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు గుల్లి ప్రతాప్, సీనియర్ నాయకుల కామిశెట్టి మల్లయ్య, 23 వార్డు సభ్యులు జాఫర్ రసూల్, లింగాల రమేష్, పసునూటి శ్రీకాంత్, కాజా వీరేందర్, శివ, అధిక సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేశారు.