ఈటెల, కౌశిక్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ

  • పద్ధతి మార్చుకోకపోతే
    ఈటలకు సరైన బుద్ధి చెప్తాం
  • కౌశిక్ రెడ్డి రౌడీలా
    వ్యవహరిస్తే సహించబోము
  • హుజురాబాద్
    నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ

జమ్మికుంట, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ నియోజకవర్గంలో బి.అర్.ఎస్ నాయకులది ఇష్టమున్నట్టు అడిందే ఆటగా నడుస్తుంది అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. శుక్రవారం రోజు పట్టణంలోని కొత్తపల్లి సాయి మేఘనా ఫంక్షన్ హాల్ లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బల్మూరి వెంకట్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బి.అర్.ఎస్ ఆవిర్భావ సభలో ఎం.ఎల్.సి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో బి.అర్.ఎస్ కార్యకర్తలు ఎది చెప్తే అదే నడుస్తుంది, అది పోలీస్ స్టేషన్ ఐనా, ఎం.అర్.ఓ ఆఫీస్ ఐనా, కలెక్టర్ ఆఫీస్ ఐనా ఎవరైనా కూడా, ఏకడైనా కూడా మేం చెప్పిందే వినాలి, మాదే నడవాలి అని మాట్లాడటం కౌశిక్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని, ప్రభుత్వ కార్యాలయాలు ఎవరి స్వంతం కాదని అవి ప్రజల సొంతమని ఈ మాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా కౌశిక్ రెడ్డి రౌడీలా వ్యవహరించడం సమంజసం కాదని దుయ్యబట్టారు.

25 కోట్లు రేవంత్ రెడ్డి కి బి.అర్.ఎస్ ఇచ్చింది అని అనడం ఈటెలకు సిగ్గులేదు, ఈటెల తన రాజకీయ ఉనికి కోల్పోతుండటం వలన ఎదో ఒక రాయి వేసి నాలుగు రోజులు ఉనికి చాటుకుందాం అనే ఆలోచనతో వేసిన అభాండం తప్ప ఈటల మాటల్లో నిజం లేదని అతనికి తెలుసని అన్నారు. ఈటెల పద్ధతి మర్చుకోక పోతే బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

కౌశిక్ రెడ్డి ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉండి ప్రజలను భయపెట్టే విధంగా మాట్లాడటం రౌడీ ల లక్షణాలని, సిగ్గుండాలని ఎద్దేవా చేసారు. ప్రెస్ మీట్ అనంతరం హనుమాన్ చౌరస్తా వద్ద ఈటెల, కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో టి.పి.సి.సి సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు , వీనవంక మండల అధ్యక్షులు సాహెబ్ హుస్సేన్, హుజురాబాద్ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్, కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల నాయకులు, హుజురాబాద్ పట్టణ మహిళ అధ్యక్షురాలు వేముల పుష్పాలత, జమ్మికుంట మాజీ పట్టణ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జూ, ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, మైనారిటీ సెల్ సలీం పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *