ఎస్.జి.టి ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం

ఎస్.జి.టి ఫోరం రాష్ట్ర
కార్యవర్గ సమావేశం

తిమ్మాపూర్, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫోరం(ఎస్. జి.టి) రాష్ట్ర కార్యవర్గ సమావేశంను హైదరాబాదు లో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఆమోదంతో తీర్మాణం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అలుమల్ల అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…సెకండరీ గ్రేడ్ టీచర్స్ కు సంబంధించి వెంటనే 10,000 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టులను వెంటనే మంజూరు చేయాలి. ఇప్పుడు జరగబోయే పదోన్నతుల్లో ఎస్.జి.టి లకు ప్రమోషన్స్ కల్పించాలి అని, కోర్టు కేసులు పరిష్క రించి వెంటనే బదిలీలు చేపట్టాలి.

317 జీవో ప్రకారం స్పౌస్ బాధితులకు వెంటనే న్యాయం చేసి బదిలీలు చేపట్టాలి, సిపిఎస్ రద్దు చేయాలి, ఎన్.పి.ఎస్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ఎమౌంట్ ను తిరిగి ఇవ్వాలి అని, ఎమౌంట్ వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపడంతో పాటు పెండింగ్ బిల్లులు అయినా జిపిఎఫ్, పార్ట్ ఫైనల్, ఏరియర్స్ త్వరగా చెల్లించాలి అని, పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలి. జూలై, 2023 నుండి ఐ.ఆర్ ను అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ ఆమోదంతో తీర్మాణం చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్జిటి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అలుమల్ల అనిల్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి జమాల్, రాష్ట్ర కోశాధికారి పానుగంటి నర్సింహాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్, జిల్లా బాధ్యులు శిరందాసు రామదాసు, వెంకటేశం, రాంమోహన్, అజయ్ తో పాటు పలువు రు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *