భర్త చితిపై భార్య..

  • సతీ సహగమనం
    చేస్తానన్న జవాన్ భార్య
  • హృదయ విదారకర ఘటన

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : మందుపాతర పేల్చిన ఘటనలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఈఘటనలో మృత్యువు ఒడిలో చేరిన ఓ జవాన్ భార్య సతీసహగమనం చేస్తానంటూ చితి పైకి చేరిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

వైవిహిక బంధంతో ఒక్కటైనందును తాను కూడా ఆయనతో పాటే చివరి శ్వాస విడుస్తానంటు రోధించిన తులే మద్కామి తన భర్తతో పాటు తనను కూడా ఇదే చితిపై దహనం చేయాలంటూ అభ్యర్థించిన తీరు స్థానికులను కలిచివేసింది. సతీసహగమనాన్ని మరిపించే విధంగా లఖ్ము భార్య తులే మద్కామి భర్తతో పెనవేసుకున్న బంధాన్ని గుర్తు చేసుకున్న వారి బంధువులు లఖ్ము చివరి చూపు చూసేందుకు వచ్చిన వారంతా చలించిపోయారు.

బీజాపూర్ జిల్లా నిరం గ్రామానికి చెందిన లఖ్ము మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. జవాన్ లఖ్ముకు అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామ సమీపంలో చితిని సిద్ధం చేయగా ఆయన భార్య తులే మద్కామి తాను కూడా భర్తతోనే కలిసి అనంతవాయువులో కలిసిపోతానంటూ చితిపై పడుకున్నారు. జీవిత భాగస్వామిగా ఇద్దరం ఒక్కటైన రోజు చివరి శ్వాస వరకూ కలిసే జీవిస్తామనికున్నామని, మందుపాతర రూపంలో తన భర్త తనకు దూరం అయ్యాడంటూ మద్కామి కన్నీరుమున్నీరుగా విలపించారు.

పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని, వారిని దిక్కులేని వారిని చేయకూడదంటూ బంధువులు సర్ది చెప్పి ఒప్పించడంతో చివరకు ఆమె చితి పై నుండి కిందకు దిగారు. ఆ తరువాత జవాన్ లఖ్ము అంత్యక్రియలు నిర్వహించారు.

కంటతడి పెట్టిస్తున్న వీడియో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *