ఎ ఐ ఎఫ్ బి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను జయప్రదం చేయండి

ఎ ఐ ఎఫ్ బి రాష్ట్ర కార్యవర్గ
సమావేశాలను జయప్రదం చేయండి

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లాలో మే నెలలో 6, 7 తేదీల్లో జరిగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి, బండారి శేఖర్ లు స్థానిక పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డిగారు రాష్ట్ర ముఖ్యనైనా నాయకులు అందరూ పాల్గొంటున్నారని తెలిపారు.

ఈ సందర్బంగా కోమటి రెడ్డి తేజ్ దీప్ రెడ్డి, బండారి శేఖర్ లు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ మహాసభలా అనంతరం మొదటి సరిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కరీంనగర్ లో నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మే నెలలో 6,7 తేదీల్లో ప్రతిమ హోటల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను చర్చించడం జరుగుతుందని అన్నారు.

భవిష్యత్తులో జరిగే పోరాటాలు ఉద్యమ కార్యచరణ రూపొందించడానికి కరీంనగర్ జిల్లా వేదిక అవుతున్నదని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో అక్టోబర్ లో నిర్వహించే రాజకీయ ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడల గురించి కార్యవర్గ సమస్యలు చర్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వడగండ్ల వర్షాలకు రైతులు తీవ్రనాష్టం జరిగిందని అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇప్పటి వరకు అందడం లేదని అన్నారు. ప్రజాప్రతినిధులు రైతులను నష్టపరిహారం ఇప్పించడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కురువల్లి శంకర్, బెక్కంటి రమేష్, జి ప్రశాంత్ కుమార్, జిల్లా నాయకులు బద్రి నేత, అరవింద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *