కానిస్టేబుల్ అభ్యర్థుల రాతపరీక్షకు అంత సిద్ధం

కానిస్టేబుల్ అభ్యర్థుల
రాతపరీక్షకు అంత సిద్ధం

  • 19 కేంద్రాలలో… 14,188
    మంది అభ్యర్థులు
  • అడిషనల్ డిసిపి (పరిపాలన)
    జి. చంద్రమోహన్

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 29 (విశ్వం న్యూస్) : పోలీసు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష కు సర్వం సిద్ధంమైంది. పాలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ళ (సివిల్/ఎ.ఆర్/ టి.ఎస్.ఎస్.పి/ఎస్.పి.ఎఫ్/ఎస్.ఏ.ఆర్ సిపిఎల్/ఎస్.ఎఫ్.ఓ) అభ్యర్థుల ఎంపిక పక్రియలో భాగంగా రాత పరీక్ష నేడు ఆదివారం జరుగనున్నది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల రాత పరీక్ష కోసం కరీంనగర్లో 19 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల, శ్రీచైతన్య డిగ్రీ , పిజి కళాశాల, అపూర్వ డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ, పిజి కళాశాల, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ , పిజి కళాశాల, తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ కాలనీలోని వాగేశ్వరి కళాశాల, జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల, శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల, కరీంనగర్ లోని కిమ్స్ డిగ్రీ , పిజి కళాశాల, వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడం జరుగనుంది. పరీక్ష ఉదయం 10 గం.ల నుండి మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగుతుంది.

అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు…

టి.ఎస్.ఎల్.ఆర్.బి తుది నిర్ణయం మేరకు హాల్టికెట్లను జారీ చేయడం జరిగింది డూప్లికేట్ హాల్ టికెట్ల జారీ చేయడం జరుగదు. ఈ పరీక్షాహాల్లో అభ్యర్థి ప్రవేశం పూర్తి కట్టుదిట్టంగా ఉంటుంది.
అభ్యర్థి యొక్క గుర్తింపును ఆయా పరీక్షా కేంద్రాల్లోని సిబ్బంది పూర్తిగా పరిశీలించిన తర్వాత అనుమతించడం జరుగుతుంది. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత అభ్యర్థులను పరీక్షాహాల్లోకి అనుమతించడం జరుగదు. పరీక్ష పూర్తయ్యేంతవరకు కూడా అభ్యర్థులు పరీక్షాహాలును వదిలి వెళ్ళరాదు.అభ్యర్ధి ఒకనిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడదని అభ్యర్థి తనకున్న హాల్ టికెట్ ను పరీక్షాకేంద్రం ప్రవేశం నందు , పరీక్షాహాల్లో చూపించాలి లేనట్లయితే పరీక్షాహాల్లోకి అనుమతించబడదు.

అభ్యర్థి ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్/ సెల్యూలర్ ఫాన్లుగాని, ట్యాబ్స్, పెన్ డ్రైవ్ లు బ్లూటూత్ లు, వాచ్ లు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుళ్ళు, పర్సులు, చార్ట్స్, విడి కాగితములు లేదా రికార్డు చేసే పరికరాలు పరీక్షా హాల్లోకి తీసుకువెళ్ళకుండా తనిఖీ చేయడం జరుగుతుంది.

పరీక్షాహాల్లోకి 1) బ్లాక్ లేదా బ్లూపాయింట్ పెన్ను 2) తుది పరీక్ష హాల్టికెట్ 3) ఏదైనా ఒక ఒరిజనల్ ధృవపత్రం (పాస్పోర్టు, పాన్కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలగునవి. వెంట ఉంచుకోవాలి)

అభ్యర్ధులు పరీక్షాహాల్లోకి నిర్ణీత సమయానికి ఒకగంట ముందుగా చేరుకోవాలి.
పరీక్షా సమయంలో అభ్యర్థి యొక్క బయోమెట్రిక్ వివరములు తీసుకోబడును, సిబ్బంది మరిచి పోయినట్లయితే అభ్యర్థులు అడిగి బయోమెట్రిక్ వివరములు నమోదు చేయించుకోవాలి.
అభ్యర్థి ఆన్ లైన్ ధరఖాస్తులో పూరించిన విధంగా తన హాల్ టికెట్ లో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.
పరీక్షరాసే ముందు అభ్యర్ధి ఓ.యం.ఆర్ షీట్ పై ఉన్న సూచనలను పూర్తిగా చదువుకోవాలి.
ప్రశ్నాపత్రంతోపాటు అందజేసిన జబాబుపత్రంలో కేటాయించిన స్థలంలోనే అభ్యర్థులు జవాబులను
రాయాలి. అభ్యర్ధి ఓ.యం.ఆర్ షీట్ పై అనవసరపు సమాచారం, గుర్తులు, మతపరమైన చిహ్నాలు, ప్రార్ధనలు లేదా గుర్తింపు చిహ్నాలు మొదలగునవి ఏవైనా రాసినచో అట్టి జవాబు పత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగదు. ఓ.యం. ఆర్ షీట్ పై చిత్తుపని చేయరాదు.
పరీక్షాహాల్లో అభ్యర్ధి ఏవిధమైన వంచనాయుత చర్యలకు పాల్పడినా అతని ఓ.యం.ఆర్ జవాబుపత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగదు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
పరీక్షాహాల్లో అభ్యర్ధి యొక్క ఫోటో , వేలిముద్రలు క్షుణ్ణంగా పరిశీలన మొదలగునవి, అభ్యర్ధియొక్క గుర్తింపు భద్రతకు అనుగుణంగా ఎటువంటి వంచనలకు అవకాశం లేకుండా ఉండేందుకు పరిశీలించబడును. అభ్యర్థులు మెహంది. సిరా మొదలగునవి వారివారి
చేతులపై గానీ పాదాలపై గానీ రాసుకుని రాకూడదు.
ప్రశ్నపత్రం ఇంగ్లీష్ / తెలుగు లేదా ఇంగ్లీష్/ఉర్దూ భాషలలో ఇవ్వబడును. ఓ.యం.ఆర్ జవాబుపత్రంలో వృత్తములను బ్లూ లేదా బ్లాక్పెన్నులతో మాత్రమే పూరించవలెను. వేరే ఏ ఇతర రంగు పెన్నులు, పెన్సిళ్ళు, ఇంక్/జెల్పెన్నులు అనుమతించబడవు.
జవాబుపత్రం మార్చబడదు. 1) ప్రశ్నకు ఇవ్వబడిన నాలుగు సమాధానాలలో సరైన సమాధానాన్ని ఎన్నుకుని ఓ.యం.ఆరేట్లో సరైన వృత్తాన్ని పూరించాలి. ఒక ప్రశ్నకు ఒకటికంటే ఎక్కువ వృత్తములను పూరించరాదు. 2) అభ్యర్థి ప్రశ్నయొక్క సమాధానంపై పూర్తి సంతృప్తి పొందిన తర్వాత మాత్రమే ఓ.యం.ఆరేట నందు పూరించవలెను. 3)ఓ.యం. ఆర్ షీట్ నందు రబ్బర్ లేదా వైట్ ఫ్లూయిడ్ లాంటివి ఉపయోగించరాదు. ఒకవేళ ఉపయోగించినచో ఓ.యం. అర్ షీట్ ను పరిగణలోకి తీసుకోవడం జరుగదు.

అభ్యర్థి పరీక్షాహాల్ వదిలి వెళ్ళేప్పుడు ఒరిజనల్ ఓ.యం. ఆర్ షీట్ , ప్రశ్నపత్రం బుక్లెట్లు ఇన్విజిలేటర్ కు ఇచ్చి వెళ్ళాలి. లేనట్లయితే తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డూప్లికేట్ ఓ.యం. ఆర్ షీట్ ను అభ్యర్థికి ఇవ్వడం జరుగుతుంది. పరీక్ష పూర్తయ్యేంత వరకు దీనిని ఒరిజనల్ ఓ.యం. ఆర్ నుండి వేరుచేయరాదు. పరీక్ష అనంతరం ఇన్విజిలేటర్ సమక్షంలో డూప్లికేట్ ఓ.యం.ఆర్ షీట్ ను పరిశీలించి వెంట తీసుకువెళ్ళాలి.పరీక్షాహాలులో అభ్యర్థి ఇతరులను కలువడం గాని వారితో మాట్లాడటం గానీ అనుమతించడం జరగదు. అభ్యర్థులు ఎంపిక విధానం పూర్తయ్యేంత వరకు హాల్ టికెట్లు భద్రపరుచుకోవాలి.
అభ్యర్థుల కోసం నిషేధింపబడినవి.

1) జవాబుపత్రంలో నిర్దేశించబడిన స్థలంలోనే హాల్టికెట్ నెంబర్ రాయాలి.
2) జవాబుపత్రంలోని ఇతర ప్రదేశాల్లో ఎక్కడా పేరు రాయకూడదు.
3) అభ్యర్థికి సంబంధించిన వివరములు ఏవీ కూడా జవాబుపత్రంలో రాయకూడదు.

పరీక్ష సమయంలో నగరంలో పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని కమీషనర్ పోలీసు అధికారులను ఆదేశించారు. లాడ్జిలలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు. నిర్ణీత సమయంలోపు బయోమెట్రిక్ తీసుకోవాలి. అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్. అభ్యర్థుల నుండి నిర్ణీత సమయంలోపు బయోమెట్రిక్ తీసుకోవాలని అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్ అన్నారు. అభ్యర్థుల ప్రవర్తనపై ఏవైనా అనుమానం ఉన్నట్లైతే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పారు.

కానిస్టేబుల్ అభ్యర్థుల రాతపరీక్ష నేపధ్యంలో శుక్రవారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఛీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు. బయోమెట్రిక్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ శ్రీలక్ష్మి, బయోమెట్రిక్ అధికారి టి మురళి, పోలీసు అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *