తెలంగాణ మోడల్ గా.. దేశానికే దారిచూపుతున్న సీఎం కేసీఆర్

తెలంగాణ మోడల్ గా.. దేశానికే దారిచూపుతున్న సీఎం కేసీఆర్

శాట్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పదవీ స్వీకార సభలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, జనవరి 5, (విశ్వం న్యూస్) : తెలంగాణలో సాధించిన అభివృద్ధి మోడల్ గా.. దేశానికి దారిచూపే కార్యాచరణను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు విజయవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో గురువారం తెలంగాణ స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ గా నియమితులైన డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు అభ్యుదయ పథంలో సాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న క్రీడా పాలసీతో తెలంగాణ క్రీడాకారులు క్రీడల్లో పతకాల పంట పండిస్తూ తెలంగాణ ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులకు కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా వారి కృషికి సీఎం కేసీఆర్ తగిన గుర్తింపు ఇస్తున్నారని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఏపీ మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఏపీశాఖ ముఖ్య నేత రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, చంటి క్రాంతి కిరణ్, అబ్రహాం, జైపాల్ యాదవ్, ఆలె వెంకటేశ్వర్ రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, గ్యాదరి కిషోర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అల్లం నారాయణ, ఆయాచితం శ్రీధర్, జూలూరి గౌరీశంకర్, కె.వాసుదేవరెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, సాయిచంద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్, సతీష్ రెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, మందా జగన్నాథం, జెడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, గ్రంథాలయాల చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, విద్యార్థిసంఘాల నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం కెసిఆర్ గారిని గురువారం ప్రగతి భవన్ లో కలిసి ఆశీస్సులు తీసుకున్న డాక్టర్ ఆంజనేయ గౌడ్.ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *