తెలంగాణకు మళ్లీ భారీ వర్ష సూచన

హైదరాబాద్, మే 6 (విశ్వం న్యూస్) : తెలంగాణలో పలు జిల్లా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్​కర్నూల్‌, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్‌, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల సమయంలో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడి, అది ఎల్లుండి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.

రాష్ట్రానికి మోచా తుఫాను ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *