ఘనంగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి
రాజేశ్వర్ రావు పుట్టినరోజు వేడుకలు

జమ్మికుంట, మే 7 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి మిత్రులు బొమ్మల గుడి శివాలయంలో పేదవారికి టవల్స్ పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రామడుగు రవీందర్ రావు గారు, కొన రెడ్డి గారు శివాలయం భక్తులు అన్నపూర్ణ సేవ సమితి వారు తదితరులు పాల్గొన్నారు.

పండ్లు పంపిణీ
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా స్పందన అనాధ ఆశ్రమంలో కెట్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గాజుల భాస్కర్, భోగం వెంకటేష్, జక్కే శివ, అబ్దుల్ రషీద్, కొమ్మ విజయ్ కోడం రాజు తదతరులు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన వివిధ పార్టీల నాయకులు
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా పలువురు కౌన్సిలర్స్, వివిధ పార్టీల నాయకులు, కార్యాలయ సిబ్బంది, పలువురు హనుమాన్ దీక్ష స్వాములు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలలో తక్కళ్ళపల్లి దంపతులు
పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారినీ,హనుమాన్ దేవాలయంలో, రామాలయంలో,దుబ్బ మల్లన్న దేవాలయంలో, బొమ్మల గుడి శివాలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు రాధిక దంపతులు.