ఘనంగా మంత్రి గంగుల
కమలాకర్ జన్మదిన వేడుకలు

18 వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని
మాధవి – కృష్ణ గౌడ్ అధ్వర్యంలో…
కరీంనగర్ బ్యూరో, మే 8 (విశ్వం న్యూస్) : కరీంనగర్ ముద్దుబిడ్డ జన హృదయ నేత మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక 18వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని.మాధవి-కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ చౌరస్తాలో కేక్ కటింగ్ చేసి నగరంలోని వృద్ధులకు యాచకులకు అన్నదానం పంపిణీ చేశారు.

అన్న నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారిపైన వారి కుటుంబ సభ్యుల పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆశీస్సులతో 18వ, 19వ డివిజన్లు మరింత అభివృద్ధి చెందాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ ఏదుల్ల. రాజశేఖర్ బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.