రాష్ట్ర బిసీ సంక్షేమ, పౌర సరఫరాలు శాఖ మంత్రి గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు

రాష్ట్ర బిసీ సంక్షేమ, పౌర
సరఫరాలు శాఖ మంత్రి గంగుల
కమలాకర్ జన్మదిన వేడుకలు

కరీంనగర్ బ్యూరో, మే 8 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర బీసీ, పౌర సరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ నియోజక వర్గ అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ జన్మదినం ను పురస్కరించుకుని కరీంనగర్ లోని జిల్లా గ్రంథాలయంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. 20 ఫీట్ ల బారీ కటౌట్ కి గ్రంధాలయ విద్యార్థులు, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణా రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హారిశంకర్ మిగతా నాయకులంతా కలిసి పాలాభిషేకం చేశారు. మాకు ఎల్లవేళలా సకల సౌకర్యాలు ఏర్పాటుకు కృషి చేస్తున్న మంత్రి కి కృతజ్ఞతలు, జన్మదిన శుభాకాంక్షలు అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు పాలాభిషేకం నిర్వహించారు.

అనంతరం విద్యార్థులకు పిఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన స్టడీ మెటీరియల్ ను 300 మంది విద్యార్థులకు అందించారు. తర్వాత గ్రంథాలయంలో విద్యార్థులకు స్వయంగా వడ్డిస్తూ వారితో కలిసి అతిథులు భోజనం చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సోమవారం రోజు మంత్రి గంగుల కమలాకర్ జన్మదినం ను పురస్కరించుకుని గ్రంథాలయంలో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు కృతజ్ఞతలు తెలియ చేస్తూ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ ని 300 మంది విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా అందించిన గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ను అభినందించారు. విద్యార్థులందరితో కలిసి భోజనం చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని అతిథులు అన్నారు. గ్రంథాలయంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం తరుపున ఉచిత వైఫై సౌకర్యాన్ని అందిస్తున్నామని వినియోగించుకోవాలని ఇంకా గ్రంథాలయంలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ప్రభుత్వం సిద్దంగా ఉంది అని అన్నారు.

సుమారు 500 మంది విద్యార్థులతో కలిసి అతిథులు భోజనం చేశారు. మంత్రి ఆయురారోగ్యాలతో అష్ట అయిశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ రాబోవు రోజుల్లో ఇంకా అత్యున్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, కరీంనగర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *