కిష్టంపేట గ్రామంలో
రెండో విడత కంటి వెలుగు

కార్యక్రమాన్ని సర్పంచ్ బండారి
ముత్తయ్య ప్రారంభించారు
వీణవంక, మే 8 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం కిష్టంపేట గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ బండారి ముత్తయ్య ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని కంటి వెలుగు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు.కంటి చూపు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
బాధితులకు పరీక్షలు అనంతరం అక్కడికక్కడే కళ్ళజోడును అందించడమే కాకుండా అవసరమయ్యే వారికి ఆపరేషన్లకు కూడా సంబంధిత ఆసుపత్రులలో చేయిస్తామన్నారు. చాలామంది తమకు చూపు తక్కువ అయిందని తెలిసికూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని వారి కోసమే నేరుగా గ్రామాల్లోకి వెళ్లి శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు

ఈ సువర్ణ అవకాశాన్ని కిష్టంపేట గ్రామంలో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకరయ్య, వార్డు సభ్యులు, డాక్టర్ రవీందర్, ఏఎన్ఎం ,ఆశ వర్కర్లు, సభ్యులు,తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.