నూతన వధూవరులను ఆశీర్వదించిన
బోయినపల్లి వినోద్ కుమార్

వరంగల్, మే 13 (విశ్వం న్యూస్) : వరంగల్ మడికొండలోని సత్య సాయి కన్వెన్షన్ లో రాష్ట్ర రుణ విమోచన సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు కుమారుడు ప్రియతం-లత ల వివాహానికి రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారితో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మర్నేని రవీందర్ రావు, BRS పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.