మే 18న సన్మాన సభతో
హోరెత్తనున్న హుజురాబాద్

గెల్లుకు ఘన స్వాగతం
హుజురాబాద్, మే 13 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ నియమించబడిన తర్వాత, నియోజకవర్గానికి మొదటిసారిగా విచ్చేస్తున్న నేపథ్యంలో, మే 18 న హుజురాబాద్ నియోజకవర్గంలో “ఆత్మీయ సన్మాన సభ” నిర్వహించి ఘనంగా స్వాగతం పలకాలనే ఉద్దేశంతో, నియోజకవర్గ సీనియర్ నాయకులందరూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ నివాసంలో సమావేశమయ్యి “సన్మాన సభ” ను విజయవంతం చేయ్యాలని నిర్ణయించారు.