కర్ణాటక విజయంతో కాంగ్రెస్ లో జోష్

- నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద సంబరాలు.
- డప్పు వాయిద్యాలు వాయిస్తూ,బానా సంచాలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు
కరీంనగర్ బ్యూరో, మే 13 (విశ్వం న్యూస్) : కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించినందున కాంగ్రెస్ కార్యకర్తలలో జోష్ వచ్చింది. ఇందిరా చౌక్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భానా సంచా లు కాలుస్తూ, డప్పులు వాయిస్తూ, మిఠాయిలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని రాబోయే ఎన్నికలలో తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
