కరాటే శిక్షణ తరగతుల పోస్టర్
ఆవిష్కరించిన ఎమ్మెల్సీ పాడి

జమ్మికుంట, మే 14 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల యందు కరాటే శిక్షణ తరగతులు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమైనవి శిక్షణ తరగతులు కరాటే యందు 25 సంవత్సరాల అనుభవం కలిగి జపాన్ వరల్డ్ ఛాంపియన్ శిహన్ మసాకియో తనకా గారిచే శిక్షణ పొందిన కరాటే మాస్టర్ ఎండీ మహమూద్ బ్లాక్ బెల్ట్ 5 త్ డాన్ శిక్షణ యివ్వబడును. ఈ కార్యక్రమమును జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ గారి అనుమతి తో మరియు zphs హెడ్ మాస్టర్ ఆకుల సదానందం గారి అధ్వర్యంలో శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది.
ఆసక్తి కలిగిన విద్యార్థులు పాల్గొని తనయొక్క ఆత్మరక్షణ కు మరియు శారీరక దారుఢ్యం పెంచుటకు గాను కరాటే ను ప్రతిఒక్కరూ నేర్చుకోవాలి. ప్రత్యేకంగా స్త్రీలకు జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కరాటే శిక్షణ చాలా ఉపయగపడుతుంది మరియు తెలంగాణ ప్రభుత్వం అధ్వర్యంలో ప్రతి సంవత్సరం నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భం గా బాలికల రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం ను మొదలు పెట్టి పూర్తి నైపుణ్యం గల కరాటే శిక్షకుల అధ్వర్యంలో శిక్షణ యిప్పించడం జరుగుతుంది అని కరాటే శిక్షకులు T.శ్రావన్ బ్లాక్ బెల్ట్ 2 వ డాన్ గారు తెలియజేశారు.
మన జమ్మికుంట కు కరాటే కు చాలా సంవత్సరాల నుంచి ఒక గుర్తింపు ఉంది. జమ్మికుంట కు చెందిన విద్యార్థులు జాతీయ మరియు అంత్జాతీయ పోటిలయందు రాణించి జమ్మికుంట కు కరాటే లో ప్రతేక గుర్తింపును తీసుకు వచ్చారని మండల కో ఆప్షన్ స్టేట్ ప్రెసిడెంట్ ఎండీ.రఫీ గారు తెలియజేశారు.