ఆశ్రమ పాఠశాల పరిశీలన చేసిన హెడ్ ప్యానెల్

ఆశ్రమ పాఠశాల పరిశీలన చేసిన హెడ్ ప్యానెల్

గోవిందరావుపేట, జనవరి 6, (విశ్వం న్యూస్) : కమిషనర్ అఫ్ ట్రైబల్ వెల్ఫేర్ హైదరాబాద్ గారి ఆదేశానుసారం కర్ణ పెళ్లి ప్రభుత్వ బాలుర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలు, వసతి గృహలను శుక్రవారం ప్యానల్ టీం హెడ్ శివరాజన్ బృందం పరిశీలించడం జరిగింది. ఈ బృందం లో అన్ని సబ్జక్ట్స్ తో పాటు ఫీజికల్ ఎడ్యుకేషన్ కు సంబందించిన పరిశీలకుడు కూడా రావడం జరిగింది..ఉపాధ్యాయులు బోదిస్తున్న తీరును పరిశీలించి లోటుపాటులను గుర్తించి వారికి తెలియజేయడం జరిగింది.
ప్యానల్ హెడ్ శివరాజన్ ఆధ్వర్యంలో స్టోర్ రూమ్, లైబ్రరీ, ల్యాబ్, కిచెన్ రూమ్, డార్మే టరీ రూమ్, క్లాస్ రూమ్స్, డైనింగ్ హాల్, బాత్రూంలు, స్నానపు గదులు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలు చేయడం జరిగింది. అనంతరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు . కల్తీ. శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా.ప్యానల్ హెడ్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పదవతరగతి లో 10/10 జి. పి. ఏ, పాంట్లు సాధించడానికి ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలనీ, క్రీడలలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించిన క్రీడాకారులను, అందుకు కృషి చేసిన పి. డి. గారికి అభినందనలు తెలపడం జరిగింది.

పరిశీలిస్తున్న ప్యానల్ బృందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *