హుజురాబాద్:వచ్చే ఎన్నికల్లో బల్మూరి వెంకట్ దే గెలుపు

హుజురాబాద్:వచ్చే ఎన్నికల్లో
బల్మూరి వెంకట్ దే గెలుపు

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు
మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో
హుజురాబాద్, మే 15 (విశ్వం న్యూస్) : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 136 సీట్స్ పొందడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో హుజురాబాద్ లో గెలిచేది బల్మూరి వెంకట్ అని అన్నారు. బీజేపీ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, మైనారిటీలను దుయ్యబట్టే చర్యలను, హిందుత్వాన్ని కేవలం ఎన్నికల సమయంలో వ్యూహంగా వాడుకోవడంపై ప్రజలు విరక్తి చెందారని, హుజురాబాద్ నియోజకర్గంలో ప్రజలు ఇక బీజేపీని విశ్వసించరని, వచ్చేది కాంగ్రెస్ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, సీనియర్ నాయకులు పానుగంటి కిరణ్ రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు పుష్పాలత, నాయకులు
ఎర్ర రవిందర్, రఘుపతి, ప్రభాకర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, రవిందర్, ఒదెలు, నర్సింగ్, రాజమౌళి, లడ్డు రమేష్, మడిపల్లి అశోక్, నాయకురాలు సొల్లు సునీత, లక్ష్మి, నియోజక వర్గంలోనీ అన్ని మండలాల ముఖ్య సీనియర్ నాయకులు, నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *