కరీంనగర్:కులవృత్తులకు లక్ష-కొత్త మోసానికి తెర
కరీంనగర్:కులవృత్తులకు
లక్ష-కొత్త మోసానికి తెర

- అయిదు సంవత్సరాల నుండి బిసిలకు మైనారిటీలకు రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం
- కులవృత్తుల వారికి లక్ష సహాయం అనేది మోచేతికి బెల్లం రాసి ఊరించడం లాంటిదే
- మంత్రి గంగుల బిసి సంక్షేమశాఖ మంత్రి అయి ఉండి బిసిలకు రుణాలు అందించకపోవడం అసమర్థత కాదా
- నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిసి, మైనారిటీ రుణాలపై ఇందిరా చౌక్ వద్ద ధర్నా
కరీంనగర్ బ్యూరో, మే 19 (విశ్వం న్యూస్) : అయిదు సంవత్సరాల నుండి బిసిలకు మైనారిటీలకు రుణాలు అందించకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.ఇందిరా చౌక్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 2018 ఎన్నికల ముందు ఇరవై వేల పైగా మంది నిరుద్యోగులు వివిధ రకాల రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఎంపీడీఓలు, మరియు మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఆమోదించబడిన దరఖాస్తుల సంఖ్య దాదాపు పన్నెండు వేలు, కానీ కేవలం పన్నెండు వందల మందికి కేవలం యాభై వేల చొప్పున రుణాలిచ్చి మమ అనిపించారని అన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ బిసి సంక్షేమశాఖ మంత్రి అయిఉండి బిసిలకు చేసిందేమీలేదన్నారు. మైనారిటీ సెల్, బిసి సెల్ అధ్యక్షులు ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ బిసిలను మైనారిటీలను ఎన్నికలప్పుడు ఓటు బ్యాంక్ గా మలచుకొని తరువాత మోసం చేయడం బిఆర్ఎస్ నాయకులకు పరిపాటి అయ్యిందన్నారు. మళ్లీ ఇప్పుడు కులవృత్తుల వారికిలక్ష రూపాయల సహాయం అని కొత్త మోసానికి తెర లేపారన్నారు. గతంలో ఆమోదింపబడిన దరఖాస్తులందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని, అయిదు నెలల క్రితం ప్రకటించిన మైనారిటీ రుణాలు వెంటనే మంజూరీ చేయాలని డిమాండ్ చేశారు. బిసి నిరుద్యోగులకు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో సయ్యద్ అఖిల్, మడుపు మోహన్, వెన్న రాజమల్లయ్య, గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, ఎం డి చాంద్, దండి రవీందర్, దన్న సింగ్, పొరండ్ల రమేష్, బత్తిని చంద్రయ్య గౌడ్,షబానా మహమ్మద్, బాలబద్రి శంకర్, తమ్మడి ఎజ్రా, లయక్,నిహాల్ అహ్మద్, మెతుకు కాంతయ్య, మామిడి సత్యనారాయణ రెడ్డి, జీడీ రమేష్, శివరాం, ఊరడి లత, ముల్కల కవిత, పద్మ, లింగమూర్తి, కీర్తి కుమార్, అష్రఫ్ ఖురేషి, కుంబాల రాజ్ కుమార్, జీలకర రమేష్, నెల్లి నరేష్, ముక్క భాస్కర్, మహమ్మద్ భారీ, సొహెల్, ఫిరోజ్, బషీర్, కమల్ తదితరులు పాల్గొన్నారు.
