Today TrendingVishwam Newsతాజా వార్తలువరంగల్

వివాహేతర సంబంధం అనుమానంతో ఇద్దరిపై దాడి

  • నర్సంపేటలో కలకలం.. చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టిన కుటుంబ సభ్యులు

విశ్వం న్యూస్, వరంగల్, 4 నవంబర్ 2026 : వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ మహిళ, వ్యక్తిపై కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కలకలం రేపింది. నెక్కొండ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మంచిర్యాలకు చెందిన ఈశ్వరికి, నర్సంపేటకు చెందిన గణేష్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఈశ్వరి భర్త, కుమారులు నర్సంపేటకు చేరుకున్నట్లు సమాచారం. అనంతరం ఈశ్వరి, గణేష్‌లను ఓ చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *