పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనేది సీఎం కేసిఆర్ ఆకాంక్ష

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం
అందాలనేది సీఎం కేసిఆర్ ఆకాంక్ష

  • అందుకే అధునాతన సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్, మే 21 (విశ్వం న్యూస్) : పేద ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ధృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అధునాతన టెక్నాలజీ, సకలసదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పూనుకున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు.. ఆదివారం నాడు హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో అధికారులు,పలు ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ లతో మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బి శాఖ ఆద్వర్యంలో నిర్మిస్తున్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, టిమ్స్ ఎల్ బి నగర్,టిమ్స్ అల్వాల్, సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ల నిర్మాణాలపై అధికారులతో చర్చించారు.

ముందుగా వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణ పురోగతిపై చర్చించారు. పోయిన నెలలో సీఎం ఆదేశాల మేరకు మంత్రి పర్యటన చేసి హాస్పిటల్ నిర్మాణ ప్రాంగణం కలియతిరిగి పలు సూచనలు చేశారు. దానికి సంబంధించిన పనుల పురోగతిపై మంత్రి అధికారులను,వర్క్ ఏజెన్సీని అడిగారు. హాస్పిటల్ నిర్మాణ స్ట్రక్చర్ విజువల్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి పరిశీలించారు. స్ట్రక్చరల్ డిజైన్స్ కూడా పరిశీలించి పలు సూచనలు చేశారు. మెయిన్ బిల్డింగ్ బ్లాకుల వారిగా నిర్మాణాలు పర్ట్ చార్ట్ ప్రకారం జరుగుతున్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నిర్మాణంలో ఇంకా వేగం పెంచాలని,అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని అదేశించారు. జూన్ 22 నాడు తాను వరంగల్ హాస్పిటల్ సైట్ విజిట్ చేస్తానని ఈ మీటింగ్ లో సూచించిన అంశాలు ఆ రోజు పరిశీలిస్తానని చెప్పారు. ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వస్తే ఎంతో మంది పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యామనే తృప్తి దీని కోసం పని చేసిన వారందరికీ కలుగుతుందని,మనసుపెట్టి పనిచేయాలని మంత్రి అధికారులను,వర్క్ ఏజెన్సీని కోరారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీని,ఆర్ అండ్ బి అధికారులను అదేశించారు.

అనంతరం రాష్ట్ర రాజదాని హైదరాబాద్ నగర నలువైపులా నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలపై చర్చించారు. ఎల్బి నగర్ 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ఈనెల 26 వరకు ప్రారంభం కావాలని అధికారులకు, వర్క్ ఏజెన్సీకి స్పష్టం చేశారు. ఆ లోపు అన్ని రకాల టెక్నికల్ అంశాలు పూర్తి చేసుకోవాలని,26 నాడు తాను స్వయంగా సైట్ విజిట్ చేసి వర్క్ ప్రోగ్రెస్ పరిశీలిస్తానని చెప్పారు. అల్వాల్ 1200 పడకల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణ పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పుట్టింగ్ పనులు మొదలు పెట్టాలని వర్క్ ఏజెన్సీకి సూచించారు. అనంతరం సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ స్ట్రక్చరల్ డిజైన్స్ పరిశీలించారు. ఈనెల 29 న అల్వాల్,సనత్ నగర్ హాస్పిటల్స్ నిర్మాణ సైట్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తానని మంత్రి చెప్పారు.

పేద ప్రజల బాగు కోసం,వారికి వైద్యం భారం కాకూడదు అనే మంచి హృదయంతో కేసిఆర్ ప్రభుత్వం ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించ తలపెట్టిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందరూ పూర్తి సమన్వయంతో పని చేయాలని,ముఖ్యమంత్రి కేసిఆర్ గారు విధించిన నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు అన్ని పూర్తి కావాలని అధికారులను,వర్క్ ఏజెన్సీని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదేశించారు.

ఈ సమీక్షలో ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి, ఎస్.ఈ లు సత్యనారయణ,హఫీజ్, నాగేందర్ రావు,ఈ.ఈ నర్సింగరావు, డి.ఈ దుర్గ ప్రసాద్, ఏ.ఈలు రోహిత్, ధీరజ్ పలువురు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *