మంత్రి గంగులను పరామర్శించిన – టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గం
తిమ్మాపూర్ , జనవరి 9 (విశ్వం న్యూస్) : రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి ఇటివల అకాల మరణం చెందగా, సోమవారం వారి నివాసంలో మంత్రిని పరామర్శించి, గంగుల మల్లయ్య పటేల్ ఆత్మకు శాంతి కలగాలని, ఘన నివాళులు అర్పించిన టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు, జిల్లా అధ్యక్షులు కొమ్మెర తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండోజు శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాదె కరుణాకర్, జిల్లా కార్యవర్గం సభ్యులు బొమ్మిడి విజయ కుమార్, సతీష్, కొమ్ము గణేష్, వినోద్, గడ్డం నరేష్, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.