బల్మూరి వెంకట్ మానవత్వపు
ఆర్థిక సహాయం అందజేత
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య ద్వారా పది వేల రూపాయలు అందజేత
జమ్మికుంట, మే 24 (విశ్వం న్యూస్): జమ్మికుంట పట్టణ పరిధిలోని అబాధి జమ్మికుంట లో పోతిరెడ్డి సందీప్ కాంగ్రెస్ కార్యకర్త గత సంవత్సరం క్రితం ఇల్లందకుంటలో మోటార్ ఆక్సిడెంట్ ద్వారా మరణించినాడు. నేడు అతని ఇంటివద్ద సంవత్సరిక కార్యక్రమం నిర్వహించబడుతున్న సందర్భంగా, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బల్మూరి వెంకట్ మానవతా ఆర్థిక సహాయం రూ. పది వేలు పంపించడంతో ఆపది వేల రూపాయలను బుదవారం అబాది జమ్మికుంటలో సందీప్ తల్లిదండ్రులు పోతిరెడ్డి మల్లయ్య- పద్మ గార్లకు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య ద్వారా అందించడం జరిగింది.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య మాట్లాడుతా సందీప్ మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని, సందీప్ కాంగ్రెస్ పార్టీ ఎన్రోల్మెంట్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మెజార్టీ సభ్యత్వలు చేయడం జరిగిందని పోతిరెడ్డి సందీప్ కు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగురి సదయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భుర్ర కుమార్ గౌడ్, మాజీ జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాసుబోజుల వెంకన్న, నాయకులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, గుర్రపు మురళి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.