
- ఘటనకు నేటితో పదమూడేళ్లు


హైదరాబాద్, మే 28 (విశ్వం న్యూస్) : తెలంగాణ ఉద్యమ హోరులో మానుకోట యువత చిందించిన రక్తం, గర్జించిన సమైక్య పిస్టళ్లకు రైల్వే కంకర రాళ్లతో ఎదురొడ్డిన తెలంగాణ వాదుల అసమాన గుండె ధైర్యం వెరసి తెలంగాణ సాధనోద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన 28 మే 2010 ఘటనకు నేటితో పదమూడేళ్లు.


- మానుకోట తిరుగుబాటు కవరేజ్ లో బాగంగా గాయపడి వరంగల్ యంజియంలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రాజును పరామర్శించి దైర్యం చెప్పిన నాటి ఉద్యమనాయకుడు.. నేటి ముఖ్యమంత్రి కేసీఆర్
- మానుకోట తిరుగుబాటుకు నేను సహితం ప్రత్యక్ష”సాక్షి” నే..!!
ఉద్యమ ఆకాంక్షతో ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలు చేసే తిరుగుబాటును ప్రత్యక్షంగా చూసాను..! పిల్లల మంటివికదరా… ఇదిగో..పులిపిల్లలామై వచ్చినామురా అంటూ దూసుకొచ్చిన ప్రజాసైన్యాన్ని అత్యంత దగ్గర నుంచి చూసాను..!! పోరాడే సంకల్పం గొప్పదయినప్పుడు.. కంకరరాయి కూడా తూటాలను,లాఠీలను ఎదిరించే ఆయుదంగా మారడాన్ని నా..కళ్ళతో చూసాను..!! ప్రజలు తిరగబడితే.. రాజ్యం పరుగులు పెట్టడాన్ని..!! అంతదాకా రక్షణవలయంలో ఉన్న మనుకున్నవాళ్ళు ప్రాణభయంతో బోరున ఏడ్వడాన్ని..!! చరిత్ర ఉన్నంతకాలం చర్చించుకునే సంఘటనను నేను ప్రత్యక్షంగా.. ప్రత్యక్షంగా.. 28-05-2010రోజున మానుకోట రైల్వేస్టేషన్ లో నేను అత్యంత సమీపంనుంచి చూసాను.
సిహెచ్ శ్రీనివాస్.. (జర్నలిస్ట్)