బుడగ జంగాల కాలనిలో
రోడ్లు, డ్రైనేజీ సమస్యను
పరిశీలించిన మోదుగు

బోడుప్పల్, మే 28 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ బుడగ జంగాల కాలనిలో రోడ్లు , డ్రైనేజీ, ఎలక్ట్రికల్ పోల్స్, లైట్స్ సమస్యలను పరిశీలించి నగర మేయర్ సామల బుచ్చి రెడ్డికి తెలియజేసిన స్థానిక కార్పొరేటర్ మొదుగు లావణ్య శేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా తక్షణమే పై సమస్యలను పరిష్కారం చేయాలని మేయర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అలీమ్ ,కాలని వాసులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. అలాగే బోడుప్పల్ 9వ డివిజన్ శ్రీనివాస కాలని కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వృద్ధులకు కళ్ళద్దాలను అందజేసిన కార్పొరేటర్ మోదుగు లావణ్య శేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డివిజన్ ప్రజలు, డాక్టర్లు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.