జూన్ 4 నుండి యంసిపిఐ(యు) రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

జూన్ 4 నుండి యంసిపిఐ(యు)
రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

నర్సంపేటలో జూన్ 4న భారీ బహిరంగ సభ
హైదరాబాద్, మే 30 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ ఓంకార్ భవన్ లో యంసిపిఐ(యు) రాష్ట్ర ప్లీనరీ పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐఖ్య) రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జయప్రదం చేయాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి ప్రజలకు, ప్రజాతంత్ర వాదులకు, బహుజన సమాజానికి పిలుపునిచ్చారు. తేదీ 30-5-2023 రోజున బాగ్ లింగం పల్లి హైదరాబాద్ ఓంకార్ భవన్ యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు చెందిన గోడ పత్రికల ఆవిష్కరణ చేసిన సందర్భంగా గాదగోని రవి మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చాలా ప్రమాదకరంలో చిక్కుకున్నదని అన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు న్యాయం చేయాలని న్యాయ పోరాటం చేస్తున్న మహిళా రెజ్లర్ల పై పోలీసులు అమానుషం గా దాడి చేసి చిత్ర హింసలు చేయటంతో పాటు అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్ప కూల్చే విధానం తప్ప మరోటి కాదని అన్నారు. ఆరోపణలకు గురైన పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసి రెజ్లర్లకు న్యాయం చేయకుండా అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం ఫాసిస్టు విధానాన్ని అనుసరించి నిర్బంధం చేయటం ఈమధ్య కాలంలో ఖమ్మం, ములుగు ,ఇతర ప్రాంతాలలో బి ఆర్ యస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయటం, హైదరాబాద్ రక్షణ కవచం అయిన 111 జివో ను అన్యాయంగా రద్దు చేసింది.

టీఎస్పిఎస్సీలో ప్రశ్న పత్రాలను లీకేజీ చేయటం, మాస్ కాపీయింగ్ ప్రోత్సహించటం, పదవ తరగతి ప్రశ్న పత్రాలు లీకేజీ కావటం అందులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు కావటం చూస్తే ప్రజాస్వామ్యం కాలరాయపడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని బిఆర్ ఎస్ పార్టీలు కూడా కలుపు కొని చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలు తప్ప మరోటి కాదని అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ శూన్యం స్పష్టంగా కనపడుతుంది. ఈ రాజకీయ శూన్యత ను భర్తీ చేయాల్సిన వామపక్ష పార్టీలు.. విస్మరించి బి ఆర్ ఎస్ వెనుకాల మోకరిల్లటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు అని అన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో సరైన రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు కోసం యంసిపిఐ(యు) పార్టీ అన్ని వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు బహుజన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో భౌగోళిక తెలంగాణ నుంచి సామాజిక తెలంగాణగా తీర్చిదిద్దుటకు జనాభా నిష్పత్తి ప్రకారం బహుజన రాజ్యాధికారం కోసం తగిన ఉద్యమ కార్యాచరణ రూపొందించి అమలు చేయుటకు రానున్న ఎన్నికల్లో 119 స్థానాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మిగితా తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్ళుటకు యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జూన్ 4,5,6 తేదీలలో గల్లీ నుండి డిల్లీ వరకు ప్రజా ఉద్యమ పోరాటాల గొంతు చాటిన విప్లవ పురిటిగడ్డ నర్సంపేటలో నిర్వహిస్తున్న సందర్భంగా జూన్ 4వ తేదీన సాయంత్రం 4 గంటలకు నర్సంపేటలో భారీ ప్రజా ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించటం జరుగుతున్నది.

ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా యంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ గారు,ఆర్ ఎం పి ఐ జాతీయ కమిటీ సభ్యురాలు కేరళ రాష్ట్ర శాసనసభ్యురాలు ఆ రాష్ట్ర ప్రొటెం స్పీకర్ కేకే రేమా, యంసిపిఐయు పోలిట్బ్యూరో సభ్యుడు కాటం నాగభూషణం హాజరవుతున్నారు. కావున ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజాతంత్ర వాదులు సామాజిక ఉద్యమ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని యంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు నిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు నిచ్చారు.

ఈ గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కుంభం సుకన్య, వనం సుధాకర్ రాష్ట్ర కమిటీ సభ్యులు మైదంశెట్టి రమేష్, పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఇస్లావత్ దశరథ్ నాయక్, రావుల ఝాన్సీ, ముడి మార్టిన్, బొద్రబోని బాను ప్రసాద్, ముడి మార్టిన్ తదతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *