మీ స్వార్థ రాజకీయల కోసం మమ్మల్ని విడదీయవద్దు

  • కరీంనగర్ ఉమ్మడి జిల్లా మస్జిద్ ఈద్గా ఖబరస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారిని విజ్ఞప్తి చేశారు

హైదరాబాద్, మే 30 (విశ్వం న్యూస్) : భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 71 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ భారత దేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులు సిగ్గులు బౌద్ధులు అన్నాతమ్ముల్లాగా గంగా జమున లాగా బతుకుతున్న వీరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించటం ఆ యొక్క రాజకీయ పార్టీ వెంటనే మానుకోవాలి అని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్ని వర్గాల ప్రజలకు పిలుపు ఇచ్చారు.

కొంతమంది వారి స్వార్ధ రాజకీయ లాభం కొరకు కొన్ని వర్గాలపై లేనిపోని అనవసరమైన మాటను మాట్లాడటం మానుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు కలిసిమెలిసి ఒకరి పండుగలకు మరోకరు వెళ్లి శుభాకాంక్షలు ఒకరికి ఒకరు తెలియజేసుకోవడం తెలంగాణ ఆచారం అలాంటి ఆచారంలో కొంతమంది వ్యక్తులు బయట నుంచి వచ్చి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులపై అనవసరమైన మాటలు మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంతో బతుకుతున్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఒకరు, ఇద్దరు కావాలని ప్రశాంత వాతావరణము చెడగొట్టడానికి ప్రయత్నించటం వెంటనే అలాంటి వ్యక్తులు మానుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు రంజాన్, బక్రీద్, హిందూ సోదరులు దసరా, దీపావళి, ఉగాది, క్రైస్తవులు క్రిస్మస్ ఇలాంటి పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నాం అన్ని వర్గాల ప్రజలు ఎంతో మంచి కలిసిమెలిసి అన్న తమ్ముడు లాగా ఉంటున్న ఈ రాష్ట్రంలో రాజకీయం స్వార్థం కొరకు కావాలని ఉద్దేశపూర్వకంగా మాటలు మాట్లాడటం అలాంటి రాజకీయ పార్టీ వెంటనే మాట్లాడటం మానుకోవాలని, బయటి నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి దీన్ని మదర్సలు తొలగిస్తాం, మసీదులను తవ్వి శివుడు వెళితే మాకు ఇవ్వండి, ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తాం, ముస్లిం మైనార్టీలకు కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన స్కాలర్షిప్ లను కూడా రద్దు చేయడం ఇలాంటి మాట్లాడే వ్యక్తులు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తులు ఇలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వాలు ముస్లింలు వర్గాలకు సంబంధించిన ప్రజలు విద్యా మరియు ఉపాధిలో వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ జస్టిస్ రంగనాథ్ మిశ్రా అలాంటి కమిషన్లతోపాటు ఇతర కమిషన్లు కూడా ముస్లిం వర్గాల గురించి అలా తెలియజేసినప్పుడే ఆ రాష్ట్రాలలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు విద్యా ఉపాధిలో కల్పిస్తూ ఆ రాష్ట్రాలు జీవోలు జారీ చేస్తే ఆ జీవోలను కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రిజర్వేషన్లను కూడా రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా మీ స్వార్థ రాజకీయాల పార్టీల కొరకు ఇతర వర్గాలకు చెందిన సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి ప్రయత్నించటం వెంటనే మానుకోవాలని అన్నారు.

భారతదేశంలో పుట్టినాము విద్య ఉపాధి కూలీ పనులు చేసి బతుకుతున్నాం, చనిపోయిన కూడా భారతదేశంలోని కనానా చేస్తారు. ఇతర ఏ దేశానికి శవానికి తీసుకొని వెళ్లరు కనుక ఇప్పటికైనా అలాంటి రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడే మాటలను వెంటనే విరమించుకోవాలని, మమ్మల్ని విడాకుట్టడానికి ప్రయత్నించే వ్యక్తులకు తగిన గుణపాఠం చెప్తామని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *